ఏపీవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నిరసనలు | YSRCP Youth Student Wing Launches Statewide Protest Over Irregulaties In AP DSC 2025, Check Out Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

ఏపీవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నిరసనలు

కర్నూలులో‌ భారీ నిరసన ర్యాలీ

  • కర్నూలులో‌ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ
  • డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ ఎంక్వయిరీ చేయాలని డిమాండ్ చేసిన విద్యార్థులు, యువత
  • నిరసన ర్యాలీలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బుట్టా ప్రతుల్, రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై రామయ్య, సిటీ ప్రెసిడెంట్ సిటీ ప్రెసిడెంట్ అహ్మద్ అలీ ఖాన్, త‌దిత‌రులు
2026-07-28 16:03:32

నెల్లూరులో డీఎస్సీ నిరసనకు తరలివచ్చిన యువత

  •  నెల్లూరు వైసీపీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి,ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన  
  • నెల్లూరులో dsc కి వ్యతిరేకం గా జరిగిన నిరసన ర్యాలీ కి భారీ స్పందన
  • వేలాదిగా విద్యార్థులు రావడంతో కిక్కిరిసిన  వీఆర్సీ సెంటర్
  • డీఎస్సీ అక్రమాలపై లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ 
  • CBI విచారణ  జరపాలని కోరుతూ ఆందోళన  
  • నిరుద్యోగ భృతి,ఫీ రీయంబర్స్‌మెంట్ హామీలు నెరవేర్చాలని డిమాండ్
  • కూటమి ప్రభుత్వం విద్యార్థులను వంచించింది:కాకాణి గోవర్ధన్ రెడ్డి 
  • విద్యార్థులకిచ్చిన హామీ నెరవేర్చలేదు.
  • లోకేష్‌పై మండిపడ్డ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి
  • డీఎస్సీ పేరుతూ లోకేష్ టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నారు.  
  • ఎలాంటి అర్హత లేని  వారికి టీచర్ ఉద్యోగాలు కట్టబెట్టారు
  • విద్యావ్యవస్థ విలువలను  లోకేష్ దిగజార్చారు.
     
2026-07-28 15:08:03

ఒంగోలులో నిరసన ర్యాలీ

  • డీఎస్సీలో అక్రమాలు నిరసిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో వైస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
  • లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్క‌ర్ భవన్ నుండి కలెక్టరేట్ వరకు వైస్సార్సీపీ యూత్, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన
  • కొద్దిసేపు చర్చ్‌ సెంటర్‌లో ఆందోళన
  • ర్యాలీలో పాల్గొన్న ఒంగోలు వైస్సార్సీపీ ఇంచార్జ్ చుండూరి రవిబాబు, పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పల్నాటి రవీంద్ర రెడ్డి
2026-07-28 14:45:23

పార్వతీపురం మన్యం జిల్లాలో ర్యాలీ

  • డీఎస్సీ అక్రమాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి మరియు యువజన విభాగం ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ
  • ఈ ర్యాలీలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, పార్టీ జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు, ఎమ్మెల్సీ విక్రాంత్, పార్వతీపురం మాజీ శాసనసభ్యులు జోగారావు, యువజన నాయకులు
2026-07-28 14:42:39

అన్నమయ్య జిల్లాలో కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ

  • అన్నమయ్య జిల్లాలో కదం తొక్కిన విద్యార్థి లోకం
  • డిఎస్సీ లో జరిగిన అవకతవకలపై నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్‌
  • సీబీఐ దర్యాప్తు జరపాలని వైఎస్సార్‌సీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్
     
2026-07-28 14:04:05

కాకినాడలో వైఎస్సార్‌సీపీ పోరు బాట

  • మెయిన్ రోడ్డు నుండి బాలాజీ చెరువు సెంట్రర్ వరకు భారీ ర్యాలీ
  • డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి నిధులు విడుదల చేయాలని డిమాండ్
  • హాజరైన యువజన విభాగం నాయకులు తోట రాంజీ, రాగిరెడ్డి బన్నీ, గౌతమ్, చంద్రకళా దీప్తీ
2026-07-28 13:19:14

రాజమండ్రిలో పోలీసుల అత్యుత్సాహం..

  • తూర్పుగోదావరి: రాజమండ్రిలో మార్గాని భరత్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ ఆందోళన
  • డీఎస్సీ స్కాంకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్‌
  • వైఎస్సార్‌సీపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
  • పోలీసులను దాటుకుని ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
     
2026-07-28 12:16:26

మచిలీపట్నంలో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ

  • కృష్ణా జిల్లా: డీఎస్సీలో అక్రమాలపై విచారణ జరిపించాలంటూ మచిలీపట్నంలో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ
  • లక్ష్మీటాకీస్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ
  • ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి పేర్ని నాని, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం, యువత, 
  • మచిలీపట్నం వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు, వైఎస్సార్‌సీపీ సింహాద్రి వికాస్, ఉప్పాల రాము
  • జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, దేవభక్తుని చక్రవర్తి
2026-07-28 12:05:45

అనంతపురంలో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ

  • డీఎస్సీ అక్రమాలపై ఉద్యమాన్ని ఉధృతం చేసిన వైఎస్సార్‌సీపీ
  • అనంతపురం నగరంలో భారీ ర్యాలీ చేపట్టిన వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగం నేతలు
  • అనంతపురం జీజీహెచ్ నుంచి సప్తగిరి సర్కిల్ దాకా భారీ నిరసన ప్రదర్శన
  • సప్తగిరి సర్కిల్ లో భారీ మానవహారం
  • ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
  • డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ విద్యార్థుల నినాదాలు
  • పాల్గొన్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి
2026-07-28 11:54:08

అనకాపల్లిలో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ

  • డీఎస్సీలో అక్రమాలకు బాధ్యతగా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ

  • ర్యాలీలో భారీగా పాల్గొన్న విద్యార్థులు, యువత

  • పెరుగు బజారు వైఎస్సార్ విగ్రహం వరకూ ర్యాలీ

  • ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఉమా శంకర్ గణేష్, అదీప్ రాజ్..

  • కంబాల జోగులు, బొడ్డేడ ప్రసాద్, ఈర్ల అనురాధ, పుల్లేటి వెంకటేష్, హేమంత్

2026-07-28 11:38:17

వైఎస్సార్‌ జిల్లా: డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ

  • డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన వైఎస్సార్సీపీ విద్యార్థి, యువత
  • జిల్లా పార్టీ కార్యాలయం నుంచి గాంధీ బొమ్మ వరకు భారీ ర్యాలీ
  • పెద్ద ఎత్తున పాల్గొన్న యువత
  • డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
  • యువతకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, ఎమ్మెల్యే దాసరి సుధా..
  • సీఈసీ సభ్యుడు సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్
2026-07-28 11:16:28

విజయవాడలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ

  • వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాలు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ

  • డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, నీట్  లీకేజీ, ఫీజు రీయింబర్స్ మెంట్ విధానం, నిరుద్యోగ భృతిపై ఆందోళన

  • సాంబమూర్తి నగర్ నుండి ధర్నా చౌక్ వరకు ర్యాలీ

  • డీఎస్సీ అక్రమాలపై నైతిక భాద్యత వహించి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్

  • నిరసనలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

  • మొండితోక జగన్‌మోహన్‌ రావు, జగ్గయ్యపేట పేట నియోజకవర్గ ఇంచార్జి తన్నేరు నాగేశ్వరావు

  • స్వామి దాస్, ఎమ్మెల్సీ రూహుల్లా, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్ రవిచంద్ర

2026-07-28 10:56:30

ఏపీలో పలు చోట్ల పోలీసుల ఓవర్‌ యాక్షన్‌

  • నిరసనల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు
  • పలు చోట్ల వైఎస్సార్‌సీపీ నేతల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీస్‌స్టేషన్లకు తరలింపు
  • దగాపడ్డ డీఎస్సీ అభ్యర్థులకు అండగా వైఎస్సార్‌సీపీ పోరాటం
  • అన్ని జిల్లా కేంద్రాల్లో కొనసాగుతున్న భారీ ర్యాలీలు, ఆందోళనలు
  • మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌
  • అక్రమాలపై సీబీఐ విచారణ జరపాల్సిందేనని డిమాండ్‌
2026-07-28 10:51:35

నెల్లూరులో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ

  • నెల్లూరులో వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాలు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ
  • డీఎస్సీ నియామకాలలో అక్రమాలు, నీట్  లీకేజీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానం, నిరుద్యోగ భృతిపై ఆందోళన
  • అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించి.. గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ
  • డీఎస్సీ అక్రమాలపై నైతిక భాద్యత వహించి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
  • నిరసనలో పాల్గొన్న మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, నేదురుమల్లి, ఆనం విజయ్‌కుమార్
2026-07-28 10:45:09

తిరుపతిలో వైఎస్సార్‌సీపీ నిరసన

  • డీఎస్సీ స్కాం బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి
  • ఎస్వీ యూనివర్సిటీ సెకండ్ గేట్ వద్ద వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
  • నిరసన ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి ఆర్కే రోజా
  • పాల్గొన్న వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం, యువజన విభాగం నాయకులు, విద్యార్థులు
  • మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి: ఆర్కే రోజా మాజీ
  • స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు పై విచారణ జరిపించాలి
  • మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ నినాదాలు
జగన్ ప్రశ్నకు సమాధానం చెప్పే ధైర్యం లేదు..! నీకు మంత్రి పదవి అవసరమా..?
2026-07-28 10:34:49

విశాఖలో వైఎస్సార్‌సీపీ నిరసన

  • డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి అంశాలపై వైఎస్సార్‌సీపీ నిరసన
  • జీవీఎంసీ గాంధీ విగ్రహం ఆందోళన చేపట్టిన విద్యార్థి యువజన  విభాగం నేతలు
  • నిరసనలో పెద్ద ఎత్తున  పాల్గొన్న విద్యార్థులు
  • డీఎస్సీ అవకతవకలపై మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
  • సీబీఐ విచారణ జరిపించాలని ప్లకార్డులు ప్రదర్శన
  • కుటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్.
2026-07-28 10:32:22

బాపట్లలో పోలీసుల ఓవరాక్షన్

  • వైఎస్సార్‌సీపీ యువజన నాయకులను ఉదయాన్నే తీసుకొచ్చి స్టేషన్‌లో కూర్చోబెట్టిన పోలీసులు
  • కోన రఘుపతి పీఏతో సహా యువజన విభాగ నాయకులను స్టేషన్‌లోనే ఉంచిన పోలీసులు
  • ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసుల ఓవరాక్షన్
  • పోలీస్ స్టేషన్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ యువజన విభాగ నాయకుల్ని కవర్ చేయొద్దు అంటూ మీడియాపై ఆంక్షలు
2026-07-28 10:28:09

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

  • విద్యార్థి, యువత విభాగాల ఆధ్వర్యంలో నిరసనలు
  • అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిరసన ప్రదర్శనలు
  • డీఎస్సీ పేపర్ లీక్, పోస్టులను అమ్ముకోవడం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి ఇవ్వకపొవడంపై నిరసన
  • మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్

 

2026-07-28 10:27:07

అక్రమాలపై సీబీఐ విచారణ జరపాల్సిందే..

  • దగాపడిన అభ్యర్థుల డిమాండ్‌
  • పేపర్‌ లీక్‌కు పక్కా ఆధారాలున్నాయి..
  • స్పోర్ట్స్‌ కోటా పేరుతో అతిపెద్ద కుంభకోణం
  • అడ్డగోలుగా పోస్టులు అమ్ముకున్నారు..
  • అందుకోసం ఏకంగా జీవోలూ తెచ్చారు..
  • అడ్డంగా దొరికిపోయినా బాధ్యత వహించరా?
  • నీట్‌ లీక్‌కు కేంద్రం బాధ్యత వహించింది కదా.. అదే బాటలో మీరూ నడవాలి
  • ధర్మేంద్ర ప్రధాన్‌ తరహాలో లోకేశ్‌ రాజీనామా చేయాలి
  • దగాపడ్డ డీఎస్సీ అభ్యర్థులకు అండగా వైఎస్సార్‌సీపీ
  • యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలు
2026-07-28 07:54:33
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement