తాడేపల్లి : ఏపీ మంత్రి నారా లోకేష్‌వి ఉత్తర కుమార ప్రగల్భాలని, చాలెంజ్ చేసి పారిపోవడం ఆయనే చెల్లిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధథి పుత్తా శివశంకర్ విమర్శించారు. నాలుగు గోడల మధ్య కూర్చుని ప్రగల్భాలు పలకడం నిజంగా సిగ్గుచేటన్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగినందునే భయంతో సీబీఐ విచారణకు ఆదేశించడం లేదని మండిపడ్డారు.
ఈరోజు(మంగళవారం, జూలై 28వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన పుత్తా శివశంకర్.. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహించి కేంద్ర మంత్రి ప్రధాన్ రాజీనామా చేశారని, అదే ఎన్డీయేలో భాగమైన టీడీపీ మంత్రి డీఎస్సీ అక్రమాలపై ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు.
‘నారా లోకేష్ వ్యవహార శైలిపై జెన్ జీ ఆగ్రహంతో ఉంది. అందుకే ఈరోజు మా పార్టీ నిర్వహించిన నిరసనల్లో జెన్ జీ పెద్ద ఎత్తున పాల్గొంది. జెన్ జీ రెస్పాన్స్ చూసి టీటీడీ నేతలకు మైండ్ బ్లాంక్ అయింది. డీఎస్సీ అక్రమాలపై వైఎస్ జగన్ ఆధారలతో సహా బయట పెట్టారు. ఆయన వేసిన ప్రశ్నలకు ఒక్క మంత్రి కూడా సమాధానం చెప్పలేకపోయారు. నారా లోకేష్ ఉత్తరకుమార ప్రగల్భాలు తప్ప సరైన సమాధానమే చెప్పలేదు.
డీఎస్సీలో అక్రమాలు జరిగినందునే నారా లోకేష్ తోక ముడిచారు. జగన్‌కు ఛాలెంజ్ చేసే స్థాయి లోకేష్‌కి లేదు. లోకేష్‌కు మా పార్టీ అధికార ప్రతినిధులు చాలు. మే8వ తేదీన నారా లోకేష్‌కు పేర్ని నాని ఓపెన్ చాలెంజ్ చేశారు. అయినా సరే లోకేష్ స్పందించలేదు. ఇప్పటికైనా లోకేష్ స్పందించి పేర్ని నానితో చర్చకు రావాలి.. లేదంటే జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.


