ప్రముఖ నటి, బిగ్‌బాస్ మలయాళం 7వ సీజన్ విజేత అనుమోల్ అనుకుట్టి పెళ్లి చేసుకుంది. తమిళనాడుకు చెందిన నటుడు, మోడల్ భువనేష్ రాజేంద్రన్‌తో ఏడడుగులు వేసింది. కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ ఆలయంలో మంగళవారం ఉదయం ఈ శుభకార్యం జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు ప్రముఖ నటుడు సురేష్ గోపీ విచ్చేసి నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. ఈ మేరకు పెళ్లి ఫొటోలని అనుమోల్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
అనుమోల్ మలయాళ సీరియల్స్‌తో ప్రేక్షకులకు సుపరిచితమే. 2014లో 'అనియతి' సీరియల్‌తో కెరీర్ ప్రారంభించింది. తర్వాత 'సత్య ఎన్న పెంకుట్టి', 'పడతా పైంకిళి', 'సురభియుం సుహాసినియుం' సీరియల్స్ చేసింది. 'స్టార్ మ్యాజిక్' షోలో తనదైన కామెడీతో అలరించింది. ఇక బిగ్‌బాస్ 7వ సీజన్ విన్నర్‌గా నిలిచి మంచి ఫేమ్ సొంతం చేసుకుంది.
ఇప్పుడు భువనేష్ రాజేంద్రన్‌ని పెళ్లాడింది. అయితే వీళ్లది ప్రేమ పెళ్లి అని తెలుస్తోంది. ఇక భువనేష్ విషయానికొస్తే పెద్దగా వివరాలైతే లేవు. తమిళనాడుకు చెందిన మోడల్, లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లుయెన్సర్ అని మాత్రమే తెలుస్తోంది.






