బిగ్‌బాస్ ఇంట్లో నాలుగో వారం ముగింపు దశకు చేరుకుంది. మరి కొన్ని గంటల్లో వీకెండ్ ఎపిసోడ్ ప్రారంభం కానుంది. నాగార్జున ఎంట్రీపై ఆసక్తి నెలకొంది. ఈ వారంలో కంటెస్టెంట్ల మధ్య జరిగిన గొడవలు, మాటల యుద్ధంపై నాగ్ క్లాస్ తీసుకోనున్నట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఇదిలా ఉంటే తాజా ప్రోమోలో హౌస్ మొత్తం కాలేజ్‌గా మారిపోయింది.
ర్యాగింగ్ చేస్తూ
‘అగ్నిపరీక్ష కాలేజ్’ పేరుతో సాగిన ఈ సరదా టాస్క్‌లో వంశీ, త్రిగుణ్, సృష్టి, రాంప్రసాద్, నరేశ్ సీనియర్లుగా.. మిగతా సభ్యులు జూనియర్లుగా కనిపించారు. రోహిత్, షాలిని క్లోజ్‌గా కూర్చోవడంపై సీనియర్లు ర్యాగింగ్ చేస్తూ నవ్వులు పూయించారు. షాలిని మీ నాన్న ఏం చేస్తుంటారని రాంప్రసాద్ అడగ్గా.. బొక్కలు ఇరుస్తాడు అని ఆమె సమాధానం చెప్తుంది. పక్కనే ఉన్న నరేశ్ ఏమి మీ నాన్న మటన్ షాప్ పెట్టున్నాడా అని సరదాగా అంటూ నవ్వులు పూయించాడు.
ఆ తర్వాత ముకేశ్–వర్షిణి మధ్య సరదా సన్నివేశంలో ముకేశ్ వర్షిణిని ముద్దు పెట్టేందుకు ట్రైచేస్తుండగా దానిని చూసి సీనియర్లు అతడిని ఆటపట్టించారు. శిక్షగా పుష్‌అప్స్ చేయించగా.. నరేశ్ కూడా రంగంలోకి దిగి తనదైన పంచులతో నవ్వించాడు. రాంప్రసాద్ వేసిన సెటైర్లకు హౌస్‌మేట్స్ అంతా నవ్వుకున్నారు. మొత్తానికి ఈ ప్రోమోలో సీనియర్ల ర్యాగింగ్, జూనియర్లపై పంచులు, కంటెస్టెంట్ల కామెడీ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇక వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున ఏ విషయాలపై కంటెస్టెంట్లను ప్రశ్నిస్తారో చూడాలి.
ఇదీ చదవండి: నీచులారా.. ఎవరినీ వదిలిపెట్టను : ఎన్టీఆర్ సంచలన ట్వీట్


