బిగ్‌బాస్ 10: ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే | Bigg Boss Telugu 10 Day 23 Highlights And 4th Week Nominations List | Sakshi
Sakshi News home page

Bigg Boss 10 Telugu Day 23: నామినేషన్లలో తొమ్మిదిమంది.. ఈ వారం ఎవరెళ్లిపోతారో?

Sep 30 2026 10:26 AM | Updated on Sep 30 2026 10:39 AM

Bigg Boss Telugu 10 Day 23 Highlights And 4th Week Nominations List

బిగ్‌బాస్‌లో ప్రతి సోమవారం నామినేషన్ల హడావుడి ఉంటుంది. ఈసారి రథం టాస్క్ ఆడించిన తర్వాత ఇది జరిగింది. సోమవారం అంతా కంటెస్టెంట్స్ రెండు జట్లుగా విడిపోయి గేమ్స్ ఆడారు. ఇందులో భైరవ టీమ్ గెలిచింది. నామినేషన్లలో చిన్నపాటి ట్విస్టులు చోటుచేసుకున్నాయి. ఇంతకీ మంగళవారం(సెప్టెంబరు 29) నాడు హౌస్‌లో ఏం జరిగింది? ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారు?

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'కి పోటీగా కొత్త రియాలిటీ షో.. లాంచింగ్ ప్రోమో)

సోమవారం రథం టాస్క్ మధ్యలో ఆపారు. దాన్ని తిరిగి కొనసాగించడంతో మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. రెండోసారీ భైరవ టీమే విజేతగా నిలిచింది. దీంతో వీళ్లకు రథం అమర్చే అవకాశం దక్కింది. ఈ జట్టు గెలవడంతో మరో టీమ్‌లోని ఎవరి దగ్గరైనా రెండు కత్తులు తీసుకోమని బిగ్‌బాస్ చెప్పడంతో వంశీ, సుధీర్.. ముకేశ్, త్రిగుణ్ కత్తుల్ని తీసుకున్నారు.

రథం టాస్క్‌లో భైరవ టీమ్ గెలవడంతో వాళ్లకే నామినేషన్స్ చేసే అవకాశమిచ్చాడు బిగ్‌బాస్. సప్తశక్తి టీమ్ ఓడిపోవడంతో అందులో ఉన్నవాళ్లంతా నామినేట్ అయ్యారు. వాళ్లలో ఇద్దరికి మాత్రమే నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పడంతో నరేశ్, త్రిగుణ్‌లకి ఆ అవకాశం దక్కింది. టెంప్టేషన్ టాస్క్ వల్ల ముకేశ్ ముందే నామినేట్ అయ్యాడు. అపూర్వ కెప్టెన్ కాబట్టి ఆమెని నామినేట్ చేయకూడదని బిగ్‌బాస్ చెప్పాడు.

తొలుత త్రిగుణ్.. రోహిత్ చేసే పనులని, మ్యానిప్యులేట్ చేసే విధానాన్ని, తన అగ్నిపరీక్ష గ్రూపిజం కారణాలు చెప్పి అతడిని నామినేట్ చేశాడు. పనులు చేయకపోవడం, బద్ధకం కారణాలుగా చెప్పాడు. నరేశ్.. అమన్‌ని నామినేట్ చేశాడు. ప్రతిదానికి గొడవ పడుతున్నాడు. అతడితో ఏమన్నా మాట్లాడాలంటే గొడవ అవుతుందేమో అనిపిస్తుంది. ప్రతి దానికి ట్రిగ్గర్ అయిపోతున్నాడు. సంచాలక్‌గా సరిగ్గా చేయలేదు, పని విషయంలో బద్ధకం అని కారణాలు చెప్పాడు. తర్వాత భైరవ టీమ్ అంతా ఒక్కొక్కరు నామినేషన్స్ చేశారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: రూ.15 లక్షలు.. పరువు.. రెండు పోయాయి!)

తొలుత ఝాన్సీ వచ్చి సృష్టిని నామినేట్ చేసింది. ఓ టాస్క్ సందర్భంగా నన్ను నామినేట్ చేయకు అని అడుక్కుంది. అంత వీక్, భయం.. వెళ్లిపోతుందేమో అని అందుకే నామినేట్ చేశానని కారణాలు చెప్పింది. అమన్.. త్రిగుణ్‌ని నామినేట్ చేశాడు. అపూర్వ.. త్రిగుణ్‌ని నామినేట్ చేసింది. చాలా ఇరిటేటింగ్ పర్సన్, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని కారణాలు చెప్పింది. రాంప్రసాద్.. షాలినిని నామినేట్ చేశాడు. బిగ్‌బాస్ ఎన్నిసార్లు చెప్పినా అదే ఆలస్యం, అలానే నిన్న జరిగిన గొడవని కారణాలుగా చూపించాడు. రాంప్రసాద్ చెబుతున్నంతసేపు షాలిని ఎప్పట్లాగే ఓవరాక్షన్ చేస్తూ అరుస్తూ మాట్లాడింది.

రోహిత్.. దేబ్జానీని నామినేట్ చేశాడు. వర్షిణి.. సృష్టిని నామినేట్ చేసింది. వంశీ.. చరణ్‌ని నామినేట్ చేశాడు. సుధీర్ కూడా చరణ్‌నే నామినేట్ చేశాడు. మొత్తంగా ఈ వారం ముకేశ్, త్రిగుణ్, దేబ్జానీ, రోహిత్, షాలిని, అమన్, నరేశ్, చరణ్, సృష్టిలు నామినేషన్స్‌లో ఉన్నారు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది.

(ఇదీ చదవండి: బ్రేకప్ చెప్పేసుకున్న బిగ్‌బాస్ తెలుగు జంట పవన్-రీతూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement