ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్‌బాస్ షో.. మన దేశంలోని హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లో విజయవంతంగా నడుస్తోంది. దీనికి పోటీగా పలు రియాలిటీ షోలు పుట్టుకొస్తున్నాయి. అలా కొన్నాళ్ల క్రితం హిందీలో మొదలైన 'ద ట్రైటర్స్' ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు లాంచింగ్ ప్రోమో వదిలారు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: రూ.15 లక్షలు.. పరువు.. రెండు పోయాయి!)
బిగ్‌బాస్ షోకి నాగార్జున హోస్ట్ చేస్తుండగా.. 'ద ట్రైటర్స్'కి హనుమాన్ మూవీ ఫేమ్ తేజా సజ్జా హోస్టింగ్ చేయనున్నారు. 20 మంది సెలబ్రిటీలతో ఈ రియాలిటీ షో ఉండనుంది. పేరుకి తగ్గట్లే మోసమే మెయిన్ కాన్సెప్ట్. రాజస్థాన్ జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో దీని షూటింగ్ చేశారు.
అక్టోబరు 15 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో 'ద ట్రైటర్స్' తెలుగు రియాలిటీ షో ప్రారంభం కానుంది. ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్స్ వస్తాయి. మరి బిగ్‌బాస్ షోలానే ఇది నెగిటివిటీ మూటగట్టుకుంటుందా? లేదా జనాలకు నచ్చుతుందా అనేది చూడాలి? ఒకే టైంలో ఇలా రియాలిటీ షోలు వస్తున్నాయి కాబట్టి వీటికి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి? మరోవైపు చిరంజీవి కూడా ఓ ఓటీటీ కోసం టాక్ షో చేయబోతున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. చూస్తుంటే తెలుగు హీరోలంతా ఓటీటీ, రియాలిటీ షోల బాటపడుతున్నారా అనే సందేహం కలుగుతోంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'అక్క'.. లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్)


