ఔను.. ఆ రూమర్స్ నిజమే | Raashii Khanna Reveals Ram Pothineni Dharman Movie | Sakshi
Sakshi News home page

Raashi Khanna: ఫొటో పోస్ట్ చేసి డిలీట్ చేసిన హీరోయిన్!

Sep 29 2026 11:59 AM | Updated on Sep 29 2026 12:07 PM

Raashii Khanna Reveals Ram Pothineni Dharman Movie

మరో రెండు వారాల్లో 'జైలర్ 2'తో థియేటర్లలోకి రాబోతున్న రజనీకాంత్.. ప్రస్తుతం 'ధర్మన్' సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ మైసూరులో జరుగుతోంది. అయితే ఇప్పటివరకు రూమర్స్‌గానే ఉన్న ఓ విషయాన్ని ఇందులో నటిస్తున్న రాశీఖన్నా బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'అక్క'.. లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్)

'ధర్మన్' షూటింగ్ మైసూరులో జరుగుతుండటంతో అక్కడి దోశ, షూటింగ్ జ్ఞాపకాల్ని పోస్ట్ చేసిన రాశీఖన్నా.. తెలుగు హీరో రామ్ ఈ మూవీలో నటిస్తున్నాడనే సంగతి రివీల్ చేసింది. గతంలో పుకార్లు వచ్చాయి. ఇప్పుడు రాశీ.. రజనీ-రామ్‌తో కలిసున్న ఫొటో పోస్ట్ చేయడంతో ఇది నిజమేనని క్లారిటీ వచ్చేసింది.

ఇందులో రజనీకాంత్ కూతురిగా రాశీఖన్నా నటిస్తుండగా.. ఈమెకు ప్రియుడిగా నెగిటివ్ టచ్ ఉన్న విలనీ తరహా పాత్రలో రామ్ కనిపించబోతున్నాడట. ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్' తీసిన అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకుడు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనే టార్గెట్‌తో దీన్ని రెడీ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: వెనకాల మాట్లాడే రకం కాదు.. నామినేషన్లలో రచ్చ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement