రజినీకాంత్‌ ‘జైలర్‌2’ పాటకు.. డేవిడ్‌ భాయ్‌ డ్యాన్స్‌ మాత్రం.. | David Warner Reacts To AI Video Of Him Dancing To Jailer 2 Song, Asks Fans To Rate His Moves, Watch Video Went Viral | Sakshi
Sakshi News home page

David Warner: ‘జైలర్‌2​‍’ పాటకు.. డేవిడ్‌ భాయ్‌ డ్యాన్స్‌ మాత్రం..

Sep 24 2026 1:16 PM | Updated on Sep 24 2026 1:32 PM

David Warner Jailer2 Ala bolelo Song AI Video Viral

డేవిడ్‌ వార్నర్‌.. క్రికెట్‌ అభిమానులకే..కాదు. సినీప్రియులకూ అలరిస్తుంటారు. ఎప్పటికప్పుడు సినిమాలోని డైలాగ్స్‌ చెప్తూ.. డ్యాన్స్‌ చేస్తూ సోషల్‌మీడియాలో కనిపిస్తూ ఉంటాడు. అయితే ఈ సారి ఓ అభిమాని జైలర్‌2 నుంచి ‘అల బోలేలో’ పాటకు డాన్స్‌ చేస్తున్నట్లుగా ఏఐ వీడియో రూపొందించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. తాజాగా దీనిపై స్పందించిన వార్నర్‌.. ‘ఇది ఎవరు చేశారో నాకు తెలీదు.. కానీ నా డాన్స్‌కు ఎన్నిమార్కులు ఇస్తారు’ అని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌చేశారు.

జైలర్-2 విషయానికి వస్తే..
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న సీక్వెల్ మూవీ జైలర్-2. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం తలైవా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే అలా బోలేలో అంటూ సాగే మాస్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు అరుణ్‌రాజా కామరాజ్‌ లిరిక్స్ అందించగా.. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశారు. 

కాగా.. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ అక్టోబర్ 15, 2026న థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణ, యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. 
ఇదీ చదవండి: దేబ్జానీపై హాస్యనటుడు బ్రహ్మానందం ప్రశంసలు..!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement