‘ది ప్యారడైజ్‌’ మూవీ స్పెషల్‌.. ఇంటర్వెల్‌లో సర్వపిండి! | Mythri Theatres Brings Sarvapindi To Mythri Vimal And Mythri Shiva For The Paradise interval Experience | Sakshi
Sakshi News home page

ది ప్యారడైజ్‌ మూవీ స్పెషల్‌.. థియేటర్స్‌లో సర్వపిండి!

Sep 23 2026 1:24 PM | Updated on Sep 23 2026 1:48 PM

Mythri Theatres Brings Sarvapindi To Mythri Vimal And Mythri Shiva For The Paradise interval Experience

సినిమా థియేటర్‌కు వెళ్లామంటే ఇంటర్వెల్‌లో పాప్‌కార్న్‌, సమోసా తినడం చాలామందికి అలవాటే. రేట్లు కాస్త ఎక్కువగా ఉన్నా.. సినిమా మధ్యలో ఏదో ఒకటి కొనుక్కుని తినాల్సిందే. ఇన్నాళ్లూ థియేటర్‌ అంటే పాప్‌కార్న్‌, సమోసాలే గుర్తొచ్చేవి. ఇకపై ఆ జాబితాలో తెలంగాణ సంప్రదాయ వంటకం సర్వపిండి కూడా చేరబోతోంది. నాని నటించిన ‘ది ప్యారడైజ్‌’ సినిమా సందర్భంగా మైత్రీ థియేటర్స్‌ సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా.. అసలైన స్థానిక రుచిని సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల క్యాంటీన్లలోకి తీసుకొచ్చింది. దీంతో సినిమా చూడటంతో పాటు తెలంగాణ సంప్రదాయ రుచిని ఆస్వాదించే అవకాశం ప్రేక్షకులకు దక్కనుంది.

(చదవండి: 'ప్యారడైజ్' సినిమా.. కొడితే కుంభస్థలం లేదంటే మాత్రం?)

హైదరాబాద్‌లోని మైత్రీ విమల్‌, మైత్రీ శివగంగ థియేటర్స్‌లో సర్వపిండిని కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. స్థానిక వంటకాలకు పెద్దపీట వేస్తూ మైత్రీ థియేటర్స్ తీసుకున్న ఈ నిర్ణయం సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని పంచుతోంది.

ఇక ప్యారడైజ్‌  సినిమా విషయానికొస్తే.. ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్‌  ఓదెల కాంబినేషన్‌ో తెరకెక్కిన చిత్రమిది. కయాదు లోహర్‌ హీరోయిన్‌ా నటించగా..మోహన్‌ బాబు, రాఘవ్‌ జుయల్‌, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్‌ బాబు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్‌ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్‌ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రోజు ముందుగానే అంటే సెప్టెంబర్‌23 ప్రీమియర్స్‌ షోలు పడనున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement