breaking news
The Traitors Telugu
-
'ద ట్రైటర్స్' విజేతగా శ్రావ్య-స్వీకర్.. ఎన్ని లక్షలు గెలుచుకున్నారంటే?
బిగ్‌బాస్ తరహాలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన షో 'ద ట్రైటర్స్'. విదేశాల్లో హిట్ అయి హిందీలోనూ వచ్చిన దీనిని ఈసారి తెలుగులోనూ తీసుకొచ్చారు. తేజా సజ్జా హోస్టింగ్ చేయగా 20 మందికి పైగా కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. మోసం చేయడం అనే కాన్సెప్ట్‌తో దీన్ని డిజైన్ చేశారు. టాలీవుడ్‌కి చెందిన ప్రగతి, హర్షవర్ధన్, చిన్మయి తదితరులు ఇందులో పాల్గొన్నారు. తాజాగా ఈ షో తొలి సీజన్ ముగిసింది. శ్యావ్య వర్మ, స్వీకర్ అగస్తీ విజేతలుగా నిలిచారు.(ఇదీ చదవండి: 'రామాయణ'కి రివ్యూ ఇచ్చిన 'వారణాసి' రాముడు)20 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో శ్రావ్య, స్వీకర్ తొలుత ఇన్నోసెంట్స్గానే గేమ్‌లోకి వచ్చారు. కానీ పరిస్థితుల కారణంగా ట్రైటర్స్ అయ్యారు. ట్రైటర్స్ అయిన తర్వాత తెలివిగా గేమ్ ఆడారు.ధనుంజయ్ వీళ్లిద్దరి గురించి అనుమానపడ్డాడు గానీ మిగతా వాళ్లు ఇది పట్టించుకోలేదు. అలా చివరకు నిలిచిన శ్రావ్య, స్వీకర్ విజేతలుగా నిలిచారు. రూ.42,77,000 ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నారు.తొలి మూడు ఎపిసోడ్ల వరకు ఉంటే చాలని అనుకున్నాను. కానీ విజేతగా నిలుస్తానని అస్సలు ఊహించలేదని శ్రావ్య చెప్పుకొచ్చింది. ఈమె స్వతహాగా సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్. ప్రముఖ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌ని పెళ్లి చేసుకుంది. స్వీకర్ అగస్తీ విషయానికొస్తే గాయకుడు, సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలి సీజన్లో భాగంగా 10 ఎపిసోడ్స్ అందుబాటులోకి వచ్చాయి. బహుశా వచ్చే ఏడాది రెండో సీజన్ ఉండొచ్చు.(ఇదీ చదవండి: మేం విడాకులు తీసుకుని 14 ఏళ్లు.. కానీ ఇప్పటికీ) -
ది ట్రైటర్స్ తెలుగు: మైండ్ గేమ్‌తో ఆకట్టుకుంటున్న డైరెక్టర్
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతున్న తెలుగు రియాలిటీ షో ‘ది ట్రైటర్స్’ ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఆరు ఎపిసోడ్లు పూర్తికాగా.. ఎవరిని నమ్మాలి? ఎవరు మోసం చేస్తున్నారు? అనే ప్రశ్నలతో గేమ్ మరింత ఉత్కంఠగా సాగుతోంది. వ్యూహాలు, అనుమానాలు, మైండ్ గేమ్స్‌తో సాగుతున్న ఈ షోలో కంటెస్టెంట్స్ ఎవరికి వారు పోటీగా ఆడుతున్నారు. ప్రతి కంటెస్టెంట్ ఒక్కో వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇక దర్శకుడు, రచయిత జె.ఎస్.ఎస్. వర్ధన్ బుద్ధిబలంతో పాటు శారీరక సామర్థ్యాన్ని కూడా ప్రదర్శిస్తూ తనదైన ఆటతీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.‘గీతా సుబ్రహ్మణ్యం’, ‘హలో వరల్డ్’ వంటి వెబ్ సిరీస్‌లతో పాటు ‘భలే ఉన్నాడే’, ‘బ్యూటీ’ వంటి చిత్రాలకు రచన, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు ‘ది ట్రైటర్స్’లో తన పరిశీలనా శక్తి, వ్యూహరచనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్యాలెస్‌లోకి అడుగుపెట్టకముందే చిన్మయిని ఎంపిక చేసుకోవడం నుంచి.. గేమ్‌లో ఎవరు ట్రేటర్ అనే విషయాన్ని విశ్లేషించడం వరకు తనదైన శైలిలో ఆడుతున్నారు.గేమ్‌లో వర్ధన్ తీసుకున్న నిర్ణయాలు ఆయన ఆటతీరుకు అద్దం పడుతున్నాయి. గౌరవ్ ట్రేటర్ కాదని నమ్మి అతనికి మద్దతుగా నిలిచిన కొద్దిమంది కంటెస్టెంట్లలో వర్ధన్ కూడా ఒకరు. మరోవైపు తనకు సన్నిహితంగా ఉన్న చిన్మయి, నిఖిల్, గౌరవ్‌లను ట్రేటర్స్ లక్ష్యంగా చేసుకోవడంతో.. గేమ్‌లోని పరిణామాలను మరింత నిశితంగా పరిశీలించారు.ఈ క్రమంలో విద్యులేఖను ట్రేటర్‌గా గుర్తించడంలో వర్ధన్ కీలక పాత్ర పోషించారు. తన అనుమానాలను వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్లి, ‘రింగ్ ఆఫ్ డౌట్’లో విద్యులేఖ ఎలిమినేషన్‌కు దోహదపడ్డారు. దీంతో కేవలం ఆటల్లోనే కాకుండా.. ఇతర కంటెస్టెంట్ల ప్రవర్తనను గమనించి నిర్ణయాలు తీసుకోవడంలోనూ వర్ధన్ చురుకుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇటీవల ప్రసారమైన నాలుగు, ఐదు, ఆరు ఎపిసోడ్లలో వర్ధన్ పేరు పలువురు కంటెస్టెంట్ల చర్చల్లో వినిపించింది. ఒకవైపు ఆయనను బలమైన ప్లేయర్‌గా భావిస్తుండగా.. మరోవైపు హిట్ లిస్ట్‌లో ఆయన పేరు ఉండటం గేమ్‌లో ఉత్కంఠను పెంచుతోంది.అసలైన ట్రేటర్‌గా రాహత్‌ను గుర్తించి, అతడి వ్యూహాలను ఇతర కంటెస్టెంట్లకు వివరించడంలో వర్ధన్ ప్రత్యేకంగా నిలిచారు. ఓట్ల లెక్కింపులో మోనిషా తనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. ఆమెను తనవైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో రాహత్ ఆమెకు మద్దతు ఇచ్చాడని వర్ధన్ విశ్లేషించారు. మోనిషాను ఎందుకు ఎంచుకున్నాడు? దాని వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? అనే అంశాలను ఇతరులకు అర్థమయ్యేలా వివరించారు. రాహత్ అసలు గేమ్ ప్లాన్‌ను బయటపెట్టడంలో వర్ధన్ విశ్లేషణ కీలకంగా మారింది.ఇప్పటివరకు ప్రసారమైన ఎపిసోడ్లలో చివరిది మరింత ఉత్కంఠను పెంచింది. వర్ధన్ షో నుంచి బయటకు వెళ్లిపోతారని కొందరు భావించినప్పటికీ.. రాహత్ ఎలిమినేట్ కావడం కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచింది. ఉదయం లేచి అల్పాహారం తీసుకోవడం కూడా గేమ్‌లో భయాందోళనలకు కారణమయ్యే పరిస్థితి నెలకొంది.మరోవైపు ట్రేటర్స్ బలమైన ప్లేయర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారనే అభిప్రాయం ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది. వర్ధన్ బలంగా ఆడుతున్నప్పటికీ.. హర్ష వర్ధన్ అతడే ట్రేటర్ అని చెప్పడం గేమ్‌ను మరో మలుపు తిప్పింది. అయితే ఆ అనుమానానికి అనుగుణంగా పరిణామాలు చోటుచేసుకోకపోవడంతో.. తదుపరి ఎపిసోడ్‌పై ఆసక్తి మరింత పెరిగింది. -
ది ట్రైటర్స్ తెలుగు: ధనంజయ్‌పై శ్రిదేవి సంచలన వ్యాఖ్యలు
ది ట్రైటర్స్ తెలుగులో ఆటగాళ్ల మధ్య అనుమానాలు, ఆరోపణలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా ధనంజయ్‌పై శ్రిదేవి చౌదరి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అతడి ఆర్థిక నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ, ధనంజయ్‌ను కొత్తగా నియమించబడిన ద్రోహిగా ఆమె పేర్కొన్నారు.తన దగ్గర డబ్బులు లేవని, తల్లికి నగలు కొనివ్వాలనుకుంటున్నానని చెప్పిన శ్రిదేవి.. ధనంజయ్‌కు ఆటల సంస్థలో వాటాలు ఉన్నాయని, అతడి సంపద రూ.300 కోట్ల వరకు ఉంటుందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, అతడిని ద్రోహిగా పేర్కొంటూ, నిన్న తప్పించుకున్నా ఈరోజు తప్పించుకోలేడనే ధోరణిలో మాట్లాడారు.ఆటలో ఇతరుల ప్రవర్తనను గమనించి ద్రోహులను గుర్తించడం కీలకం. ఈ నేపథ్యంలో శ్రిదేవి చేసిన ఆరోపణలు ఇతర ఆటగాళ్ల అభిప్రాయాలను ప్రభావితం చేస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ధనంజయ్‌పై ఆమెకు ఉన్న అనుమానాలకు ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, అతడి స్పందన ఎలా ఉండబోతోంది అన్నది తదుపరి పరిణామాల్లో తేలనుంది. మొత్తానికి, ధనంజయ్‌పై శ్రిదేవి చేసిన సంచలన వ్యాఖ్యలు ది ట్రైటర్స్ తెలుగులో కొత్త చర్చకు తెరతీశాయి. ఈ పరిణామం ఆటలో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి. -
అనుమానాలతో ఆట.. గట్ ఫీలింగ్‌తో శ్రావ్య వర్మ
ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ ప్రస్తుతం ‘ది ట్రైటర్స్ తెలుగు’లో తన ఆటతీరుతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తన ‘గట్ ఫీలింగ్’పై నమ్మకంతో ముందుకెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో హిందీ వెర్షన్ ‘ది ట్రైటర్స్’ సీజన్ 2లో పాల్గొన్న పరుల్ గులాటీతో శ్రావ్యను పోలుస్తూ నెట్టింట చర్చ జరుగుతోంది.‘రింగ్ ఆఫ్ డౌట్’ టాస్క్లోరెడ్డిట్లో జరిగిన చర్చలో వీరిద్దరి ఆటతీరులోని పోలికలను నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. ఆటలోని పరిణామాలను తమదైన కోణంలో విశ్లేషించడం, అనుమానాలను బలంగా వ్యక్తం చేయడం వీరిద్దరిలో కనిపించే లక్షణాలుగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ‘రింగ్ ఆఫ్ డౌట్’ టాస్క్‌లో శ్రావ్య ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తన అంతరాత్మ చెప్పిందే నమ్ముతాననే ఆమె వైఖరి కూడా చర్చకు కారణమైంది.మోసాలు, రహస్యాలు, వ్యూహాలతో సాగే ఈ ఆటలో ఎవరిని నమ్మాలి? ఎవరిపై అనుమానం వ్యక్తం చేయాలి? అనేది కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో శ్రావ్య తన అంచనాలపై గట్టిగా నిలబడటాన్ని కొందరు ఆమె పరిశీలనా సామర్థ్యంగా చూస్తుండగా.. మరికొందరు కేవలం అంతరాత్మ చెప్పిన మాటను నమ్మడం ఎంతవరకు సరైనదని ప్రశ్నిస్తున్నారు. శ్రావ్య వర్మ గట్ ఫీలింగ్మరి శ్రావ్య వర్మ గట్ ఫీలింగ్ ఆమెకు విజయాన్ని అందిస్తుందా? లేక తప్పు అంచనాలతో ఇబ్బందుల్లో పడేస్తుందా? రాబోయే ఎపిసోడ్లలో ఆమె అనుమానాలు ఎంతవరకు నిజమవుతాయనేది ఆసక్తికరంగా మారింది.కాగా తేజ సజ్జా హోస్ట్‌గా ‘ది ట్రైటర్స్ తెలుగు’ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియోతో పాటు ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఎపిసోడ్లు విడుదలవుతున్నాయి.(ఇదీ చదవండి: విధి విసిరిన సవాళ్లు.. వ్యాధులను జయించిన తారలు..) -
వీకెండ్ ధమాకా.. ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి దసరా సెలవులు కలిసి రావడంతో ఫ్యామిలీస్ ఎంజాయ్ మోడ్‌లో ఉన్నారు. థియేటర్లలోకి విజయ్ దేవరకొండ రణబాలి, రజనీకాంత్ జైలర్ 2 సినిమాలు వచ్చాయి. వీటిలో రెండింటికి ప్రస్తుతం మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఓటీటీల్లోకి ఈ వీకెండ్ ఏకంగా 34 మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి.(ఇదీ చదవండి: ‘రణబాలి’మూవీ రివ్యూ)ఈ శుక్రవారం(అక్టోబర్ 16) ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే 34 వరకు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో రోజా 'లెనిన్ పాండియన్', కుకూన్స్, ఎన్న విలై, ఆశా, సుగ్రీవ, వసుదేవ సుతం, దహాన్, కాగితం పడవలు, ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ మూవీస్ చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏయే చిత్రాలు ఏయే ఓటీటీల్లో ఉన్నాయంటే?ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన మూవీస్ (అక్టోబర్ 16)అమెజాన్ ప్రైమ్లెనిన్ పాండియన్ - తెలుగు డబ్బింగ్ సినిమాకుకూన్స్ - తెలుగు మూవీమాస్టర్ ప్లాన్ - తెలుగు డబ్బింగ్ మూవీహొకుమ్ - తెలుగు డబ్బింగ్ సినిమామేక్ మీ టింగిల్ సీజన్ 1 - తెలుగు డబ్బింగ్ కొరియన్ సిరీస్ద ట్రైటర్స్ - తెలుగు రియాలిటీ షోమెరిలియా మెండొంక - బ్రెజిలియన్ సిరీస్హోమ్ టౌన్ జెయింట్స్ - ఇంగ్లీష్ సిరీస్డ్రాపౌట్ - హిందీ సినిమా (రెంట్)ఫ్రెండ్స్ సెక్స్ అండ్ గేమ్స్ - జర్మన్ సిరీస్కుర్లా తో వెంగుర్లా - మరాఠీ సినిమాటల్సా కింగ్ సీజన్ 4 - ఇంగ్లీష్ సిరీస్నెట్ఫ్లిక్స్ఎన్న విలై - తెలుగు డబ్బింగ్ మూవీమనీట్రాప్: ద కరున్ ట్రెజర్ - టర్కిష్ సిరీస్చికెన్ షాప్ డేట్ - ఇంగ్లీష్ సిరీస్సీరియస్లీ సింగిల్ టూ - సౌతాఫ్రికన్ మూవీథెరపీ డన్ రైట్ - అర్జెంటినా సినిమాద డిసిపెల్ - ఇంగ్లీష్ మూవీనార్మ్:ద టేల్ ఆఫ్ నార్మ్ మెక్ డొనాల్డ్ - ఇంగ్లీష్ సినిమాహార్ట్ లేక్: ద మ్యూజికల్ - ఇంగ్లీష్ మూవీఈవిల్ డెడ్ బర్న్ - ఇంగ్లీష్ సినిమాడ్రాగన్ బాల్ సూపర్: బీరస్ - ఇంగ్లీష్ యానిమేటెడ్ సిరీస్హాట్స్టార్కప్పీ స్క్వాడ్ - తెలుగు డబ్బింగ్ సిరీస్జీ5ఆశా - తెలుగు డబ్బింగ్ మూవీకోన్ యశ్వంత్ పన్సారే - మరాఠీ సిరీస్ఆహాసుగ్రీవ - తెలుగు సినిమావసుదేవ సుతం - తెలుగు మూవీఎన్ ఎన్నై ఏదో సేదై - తమిళ సినిమాదహాన్ - తెలుగు డబ్బింగ్ మూవీసన్ నెక్స్ట్కాగితం పడవలు - తెలుగు చిత్రంఒరు అన్వేషినంతింటే తుడక్కం - మలయాళ సినిమాఆపిల్ టీవీ ప్లస్టెంజెంగ్ - ఇంగ్లీష్ మూవీసోనీ లివ్డిసి - తెలుగు డబ్బింగ్ సినిమామనోరమ మ్యాక్స్ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ - తెలుగు డబ్బింగ్ మూవీ(ఇదీ చదవండి: రాజమౌళికే సవాల్! అంచనాలను ముంచేసిన ‘రామాయణ’) -
ఈ వారం ఓటీటీల్లోకి 26 సినిమాలు.. ఆ ఐదు మిస్ అవ్వొద్దు
మరోవారం వచ్చేసింది. ఈసారి వీకెండ్ తర్వాత దసరా పండగ రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే స్కూల్స్‌కి సెలవులు ఇచ్చేశారు. మరోవైపు థియేటర్లలో రజనీకాంత్ 'జైలర్ 2', విజయ్ దేవరకొండ 'రణబాలి' చిత్రాలతో పాటు గరివిడి లక్ష్మి, క్రేజీ కళ్యాణం, ఎంత చిత్రం కథ అనే తెలుగు మూవీస్ రిలీజ్ కానున్నాయి. ఓటీటీల్లోనూ చాలానే చూడదగ్గ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: హీరోయిన్గా శ్రీకాంత్ కూతురు.. రొమాంటిక్ పోస్టర్)ఓటీటీల్లో ఈ వారం స్ట్రీమింగ్‌లోకి వచ్చే మూవీస్-వెబ్ సిరీసులు ఏకంగా 26 వరకు ఉండగా.. వీటిలో ఎన్న విలై, ద ట్రైటర్స్, ఆశా, కాగితం పడవలు, ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ లాంటి తెలుగు స్ట్రెయిట్ మూవీస్, సిరీస్, రియాలిటీ షో ఉన్నంతలో చూడాలని ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమా అందుబాటులోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబర్ 12 నుంచి 18 వరకు)నెట్ఫ్లిక్స్ద ట్రాప్ (జర్మన్ సిరీస్) - అక్టోబర్ 13టైసన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్) - అక్టోబర్ 13హంటింగ్ గ్యారీ గ్లిట్టర్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 14లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 11 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 14ఎన్న విలై (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 15హాలీవుడ్ ఆర్ట్స్ (ఇంగ్లీష్ సిట్ కామ్ సిరీస్) - అక్టోబర్ 15ద డిప్లమాట్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 15ద స్టోర్మ్ (స్వీడిష్ సినిమా) - అక్టోబర్ 15మనీట్రాప్: ద కరుణ్ ట్రెజర్ (టర్కిష్ సిరీస్) - అక్టోబర్ 16డ్రాగన్ బాల్ సూపర్: బీరస్ (ఇంగ్లీష్ యానిమేటెడ్ సిరీస్) - అక్టోబర్ 16అమెజాన్ ప్రైమ్హెల్లువ బాస్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 13లవ్ ఆఫ్ యువర్ లైఫ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 14ద ట్రైటర్స్ (తెలుగు రియాలిటీ షో) - అక్టోబర్ 15మాస్టర్ ప్లాన్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 16టల్సా కింగ్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 16హాట్స్టార్డిస్ క్లోజర్ డే (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 12కాఫీ విత్ కరణ్ సీజన్ 9 (హిందీ టాక్ షో) - అక్టోబర్ 14విజన్ క్వెస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 14క్రిస్టల్ లేక్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 15కప్పీ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 15జీ5ఆశా (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబర్ 16సన్ నెక్స్ట్కాగితం పడవలు (తెలుగు సినిమా) - అక్టోబర్ 16ఒరు అన్వేషినంత్ తుడక్కమ్ (మలయాళ మూవీ) - అక్టోబర్ 16మనోరమ మ్యాక్స్ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 15సోనీ లివ్డిసి (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబర్ 16ఆపిల్ టీవీ ప్లస్టెంజింగ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 16(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమా) -
ఆ నమ్మకంతో వెంటనే ఒప్పుకున్నాను
‘‘మిరాయ్’ సినిమా పూర్తయిన తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్లు ‘ది ట్రెయిటర్స్’ రియాలిటీ షోకి హోస్ట్ కోసం నన్ను సంప్రదించారు. ‘ట్రెయిటర్స్’ అనేది గ్లోబల్‌గా పెద్ద హిట్ ఫ్రాంచైజ్. 20కి పైగా దేశాల్లో, 25కి పైగా భాషల్లో చేశారు. హిందీలో కరణ్ జోహార్‌గారు చేసిన ఒక ఎపిసోడ్ చూడడం మొదలుపెట్టి, రెండు రోజుల్లో మొత్తం సీజన్ పూర్తి చేశాను. నాకు అప్పుడే ఈ కాన్సెప్ట్, షో నచ్చాయి. ఈ షో ఫార్మాట్ అంత స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి అన్ని భాషల్లో విజయవంతమైంది. ఆ నమ్మకంతోనే వెంటనే ఒప్పుకున్నాను’’ అని హీరో తేజ సజ్జ తెలిపారు. విభిన్న రంగాలకు చెందిన 20 మంది సెలబ్రిటీలు ఈ ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ గేమ్‌లో పాల్గొంటున్నారు. మొత్తం 10 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ షో తెలుగులో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్‌తో ఈ నెల 15నుంచి ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్ విడుదల కానుంది. ఈ షోని హోస్ట్ చేస్తున్న తేజ సజ్జ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘తెలుగులో ఇంత పెద్ద స్కేల్లో ఒక రియాలిటీ షో ఎప్పుడూ చూడలేదు. ఈ షో ఫార్మాట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నిజంగా ఇది ఒక మర్డర్ మిస్టరీ సినిమాలా, థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టుగా ఉంటుంది. ఇక నేను హీరోగా నటిస్తున్న ‘జాంబీ రెడ్డి 2’ మూవీ షూటింగ్‌ని ఇటీవల ఆరంభించాం’’ అని పేర్కొన్నారు. -
‘ది ట్రైటర్స్ తెలుగు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ది ట్రైటర్స్ తెలుగు: రూ.కోటి కోసం తలపడే 20 మంది వీరే.. గేమ్ రూల్ ఇదే..
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హోస్ట్‌గా డిజిటల్ స్పేస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. గ్లోబల్ హిట్ రియాలిటీ ఫార్మాట్ ఆధారంగా ‘ది ట్రైటర్స్ తెలుగు’ ట్రైలర్‌ను ప్రైమ్ వీడియో తాజాగా విడుదల చేసింది. 20 మంది ప్రముఖ సెలబ్రిటీలతో సాగే ఈ మైండ్ గేమ్ షో అక్టోబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. బిగ్‌బాస్‌కు భిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ షోలో విజేతకు భారీ ప్రైజ్‌మనీ ఉండటంతో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. మరి ఈ షోలో పాల్గొంటున్న ఆ 20 మంది ఎవరు? అసలు ‘ది ట్రైటర్స్’ కాన్సెప్ట్ ఏంటి?20 మంది సెలబ్రిటీల లిస్ట్ఈ షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ లిస్ట్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద, పాపులర్ యాక్టర్ హర్షవర్ధన్, తెలుగు సీనియర్ నటి ప్రగతి మహావది, నటుడు విష్ణు ఓయ్, కమెడియన్ విద్యుల్లేఖా రామన్ ఇందులో మెయిన్ అట్రాక్షన్‌గా నిలవనున్నారు. వీరితో పాటు నిఖిల్ విజయేంద్ర సింహ, శ్రీదేవి చౌదరి, శ్రావ్య వర్మ, డాక్టర్ మేఘనాథ్ రెడ్డి, మౌనీషా చౌదరి, స్వీకార్ అగస్తి, ఆషికా పదుకోన్, వర్ష డిసౌజా, ప్రణవ్ (అభినవకవి), ఎస్ఎస్ వర్ధన్, రహత్ అచంట, గౌరవ్ సునీల్, సాయి రోనక్, పుప్పాల ధనంజయ్, ఫల్గుణి బంగేరా ఈ క్రేజీ గేమ్ ఆడనున్నారు.'ది ట్రైటర్స్' కాన్సెప్ట్ ఏంటి?గ్లోబల్ లెవెల్లో సంచలనం సృష్టించిన ఇంటర్నేషనల్ రియాలిటీ ఫార్మాట్ ఆధారంగా ఈ ‘ది ట్రైటర్స్’ షో రూపొందింది. హిందీ వర్షన్ సక్సెస్ సాధించిన తర్వాత, ఇప్పుడు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ప్రైమ్ వీడియో దీనిని సరికొత్తగా డిజైన్ చేసింది. ఈ షోలో పాల్గొనే 20 మంది సెలబ్రిటీలను 'ఇన్నోసెంట్స్', 'ట్రైటర్స్' అని రెండు గ్రూపులుగా విడదీస్తారు. సీక్రెట్‌గా ఉండే 'ట్రైటర్స్' ఎవరనేది కనిపెట్టడం ఇన్నోసెంట్స్ ముందున్న అసలు ఛాలెంజ్. ఒకరినొకరు నమ్మడం, వెన్నుపోటు పొడవడం, సైకలాజికల్ మైండ్ గేమ్‌లతో నామినేట్ చేసుకోవడం లాంటి ఊహించని ట్విస్టులు ఈ 10 ఎపిసోడ్లలో రచ్చ చేయబోతున్నాయి. ప్రతీ సంభాషణ ఒక క్లూ ఇవ్వచ్చు, లేదా తప్పుడు వ్యక్తిని ప్రమాదంలో పడేయవచ్చు. 10 ఎపిసోడ్లుగా సాగే ఈ షోలో ప్రేక్షకులకు వరుస ట్విస్టులు ఎదురుకానున్నాయి.(ఇదీ చదవండి: స్టేటస్ కోసం ఐఫోన్ కొంటున్నారా..? హీరో విజయ్ సూచనలు ఇవే..) -
బిగ్‌బాస్‌ని మించిన షో.. ఏకంగా రూ. కోటి ప్రైజ్‌మనీ! ట్రైలర్
తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తొలి రియాలిటీ గేమ్ షో ‘ది ట్రైటర్స్ తెలుగు’ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ షో నాలుగు వారాల పాటు తెలుగు భాషలో ఇంగ్లిష్ సబ్ టైటిల్స్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్లో అక్టోబరు 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. పది ఎపిసోడ్స్‌తో ఈ సిరీస్‌లో రూపొందుతోంది. మోసం, మారుతున్న స్నేహాలు, ఊహించని ట్విస్టులతో సాగనున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ షో మరింత ఆసక్తికరంగా సాగనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.ఈ రియాలిటీ షోలో వివిధ రంగాలకు చెందిన 20 మంది ప్రముఖులు పాల్గొన్నారు. చిన్మయి శ్రీపాద, హర్షవర్ధన్, ప్రగతి మహావాది, శ్రీదేవి చౌదరి, నిఖిల్ విజయేంద్ర సింహా, విద్యు రామన్, విష్ణు ఓయ్, శ్రావ్య వర్మ, డా. మేఘనాథ్ రెడ్డి, మౌనీషా చౌదరి, స్వీకర్ అగస్తి, ఆశికా పదుకొనే, వర్షా డిసౌజా, ప్రణవ్ అలియాస్ అభినవకవి, ఎస్ఎస్ వర్ధన్, రహత్ ఆచంట, గౌరవ్ సునీల్, సాయి రోనక్, పుప్పాల ధనుంజయ, ఫల్గుణి బంగేరా ఇందులో కనిపించనున్నారు.ఎవరు ట్రైటర్స్.. ఎవరు ఇన్నోసెంట్స్?షోలో కొందరు ‘ట్రైటర్స్’గా, మరికొందరు ‘ఇన్నోసెంట్స్’గా వ్యవహరిస్తారు. తమ మధ్య దాగి ఉన్న ట్రైటర్స్‌ను ఇన్నోసెంట్స్ గుర్తించాలి. అయితే ఎవరిని నమ్మాలో, ఎవరిని అనుమానించాలో తెలియని పరిస్థితులు ఏర్పడతాయి. ప్రతి సంభాషణ, ప్రతి స్నేహం, ప్రతి కూటమి వెనుక ఏదో ఒక వ్యూహం ఉండేలా ట్రైలర్‌ను రూపొందించారు. ట్రైలర్లో కంటెస్టెంట్ల మధ్య అనుమానాలు, వాగ్వాదాలు, ఉత్కంఠభరితమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే షోలోని అసలు ట్విస్టులను మాత్రం బయటపెట్టకుండా ఆసక్తిని పెంచేలా ట్రైలర్‌ను కట్ చేశారు. ఊహించని మలుపులతో సాగే ఈ రియాలిటీ షోలో తేజ సజ్జ హోస్టింగ్ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.(ఇదీ చదవండి: స్టేటస్ కోసం ఐఫోన్ కొంటున్నారా..? హీరో విజయ్ సూచనలు ఇవే..) -
ఇట్స్ ఏ గేమ్
తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తొలి రియాలిటీ గేమ్ షో ‘ది ట్రైటర్స్ తెలుగు’ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ షో నాలుగు వారాల పాటు తెలుగు భాషలో ఇంగ్లిష్ సబ్ టైటిల్స్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్లో అక్టోబరు 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. పది ఎపిసోడ్స్‌తో రూపొందుతున్న ఈ సిరీస్‌లో విభిన్న రంగాలకు చెందిన 20 మంది ప్రముఖులు పాల్గొంటారు.ఎస్ఓఎల్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘ది ట్రైటర్స్’ గేమ్ షో అనౌన్స్మెంట్ వీడియోను మంగళవారం మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ‘ఒక్కటి మాత్రం పక్కా... ఇక్కడ అందరూ మోసపోతారు... మోసం కూడా చేస్తారు’, ‘ఒక్కర్ని చేస్తే మోసం... ఇద్దర్నీ చేస్తే... అందర్నీ చేస్తే... ఇట్స్ ఏ గేమ్’ అంటూ తేజ సజ్జా చెప్పిన సంభాషణలు ఈ వీడియోలో ఉన్నాయి. -
'బిగ్‌బాస్'కి పోటీగా కొత్త రియాలిటీ షో.. లాంచింగ్ ప్రోమో
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్‌బాస్ షో.. మన దేశంలోని హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లో విజయవంతంగా నడుస్తోంది. దీనికి పోటీగా పలు రియాలిటీ షోలు పుట్టుకొస్తున్నాయి. అలా కొన్నాళ్ల క్రితం హిందీలో మొదలైన 'ద ట్రైటర్స్' ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు లాంచింగ్ ప్రోమో వదిలారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: రూ.15 లక్షలు.. పరువు.. రెండు పోయాయి!)బిగ్‌బాస్ షోకి నాగార్జున హోస్ట్ చేస్తుండగా.. 'ద ట్రైటర్స్'కి హనుమాన్ మూవీ ఫేమ్ తేజా సజ్జా హోస్టింగ్ చేయనున్నారు. 20 మంది సెలబ్రిటీలతో ఈ రియాలిటీ షో ఉండనుంది. పేరుకి తగ్గట్లే మోసమే మెయిన్ కాన్సెప్ట్. రాజస్థాన్ జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో దీని షూటింగ్ చేశారు.అక్టోబరు 15 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో 'ద ట్రైటర్స్' తెలుగు రియాలిటీ షో ప్రారంభం కానుంది. ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్స్ వస్తాయి. మరి బిగ్‌బాస్ షోలానే ఇది నెగిటివిటీ మూటగట్టుకుంటుందా? లేదా జనాలకు నచ్చుతుందా అనేది చూడాలి? ఒకే టైంలో ఇలా రియాలిటీ షోలు వస్తున్నాయి కాబట్టి వీటికి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి? మరోవైపు చిరంజీవి కూడా ఓ ఓటీటీ కోసం టాక్ షో చేయబోతున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. చూస్తుంటే తెలుగు హీరోలంతా ఓటీటీ, రియాలిటీ షోల బాటపడుతున్నారా అనే సందేహం కలుగుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'అక్క'.. లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్)


