– తేజ సజ్జ
‘‘మిరాయ్’ సినిమా పూర్తయిన తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్లు ‘ది ట్రెయిటర్స్’ రియాలిటీ షోకి హోస్ట్ కోసం నన్ను సంప్రదించారు. ‘ట్రెయిటర్స్’ అనేది గ్లోబల్‌గా పెద్ద హిట్ ఫ్రాంచైజ్. 20కి పైగా దేశాల్లో, 25కి పైగా భాషల్లో చేశారు. హిందీలో కరణ్ జోహార్‌గారు చేసిన ఒక ఎపిసోడ్ చూడడం మొదలుపెట్టి, రెండు రోజుల్లో మొత్తం సీజన్ పూర్తి చేశాను. నాకు అప్పుడే ఈ కాన్సెప్ట్, షో నచ్చాయి. ఈ షో ఫార్మాట్ అంత స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి అన్ని భాషల్లో విజయవంతమైంది. ఆ నమ్మకంతోనే వెంటనే ఒప్పుకున్నాను’’ అని హీరో తేజ సజ్జ తెలిపారు.
విభిన్న రంగాలకు చెందిన 20 మంది సెలబ్రిటీలు ఈ ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ గేమ్‌లో పాల్గొంటున్నారు. మొత్తం 10 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ షో తెలుగులో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్‌తో ఈ నెల 15నుంచి ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్ విడుదల కానుంది. ఈ షోని హోస్ట్ చేస్తున్న తేజ సజ్జ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘తెలుగులో ఇంత పెద్ద స్కేల్‌లో ఒక రియాలిటీ షో ఎప్పుడూ చూడలేదు. ఈ షో ఫార్మాట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నిజంగా ఇది ఒక మర్డర్ మిస్టరీ సినిమాలా, థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టుగా ఉంటుంది. ఇక నేను హీరోగా నటిస్తున్న ‘జాంబీ రెడ్డి 2’ మూవీ షూటింగ్‌ని ఇటీవల ఆరంభించాం’’ అని పేర్కొన్నారు.


