'ద ట్రైటర్స్' విజేతగా శ్రావ్య-స్వీకర్.. ఎన్ని లక్షలు గెలుచుకున్నారంటే? | The Traitors Telugu Winner And Prize Money Details | Sakshi
Sakshi News home page

The Traitors Telugu: బిగ్‌బాస్ తరహా రియాలిటీ షో.. అప్పుడే పూర్తి

Nov 6 2026 3:46 PM | Updated on Nov 6 2026 3:56 PM

The Traitors Telugu Winner And Prize Money Details

బిగ్‌బాస్ తరహాలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన షో 'ద ట్రైటర్స్'. విదేశాల్లో హిట్ అయి హిందీలోనూ వచ్చిన దీనిని ఈసారి తెలుగులోనూ తీసుకొచ్చారు. తేజా సజ్జా హోస్టింగ్ చేయగా 20 మందికి పైగా కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. మోసం చేయడం అనే కాన్సెప్ట్‌తో దీన్ని డిజైన్ చేశారు. టాలీవుడ్‌కి చెందిన ప్రగతి, హర్షవర్ధన్, చిన్మయి తదితరులు ఇందులో పాల్గొన్నారు. తాజాగా ఈ షో తొలి సీజన్ ముగిసింది. శ్యావ్య వర్మ, స్వీకర్ అగస్తీ విజేతలుగా నిలిచారు.

(ఇదీ చదవండి: 'రామాయణ'కి రివ్యూ ఇచ్చిన 'వారణాసి' రాముడు)

20 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో శ్రావ్య, స్వీకర్ తొలుత ఇన్నోసెంట్స్‌గానే గేమ్‌లోకి వచ్చారు. కానీ పరిస్థితుల కారణంగా ట్రైటర్స్ అయ్యారు. ట్రైటర్స్ అయిన తర్వాత తెలివిగా గేమ్ ఆడారు.ధనుంజయ్ వీళ్లిద్దరి గురించి అనుమానపడ్డాడు గానీ మిగతా వాళ్లు ఇది పట్టించుకోలేదు. అలా చివరకు నిలిచిన శ్రావ్య, స్వీకర్ విజేతలుగా నిలిచారు. రూ.42,77,000 ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నారు.

తొలి మూడు ఎపిసోడ్ల వరకు ఉంటే చాలని అనుకున్నాను. కానీ విజేతగా నిలుస్తానని అస్సలు ఊహించలేదని శ్రావ్య చెప్పుకొచ్చింది. ఈమె స్వతహాగా సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్. ప్రముఖ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌ని పెళ్లి చేసుకుంది. స్వీకర్ అగస్తీ విషయానికొస్తే గాయకుడు, సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలి సీజన్‌లో భాగంగా 10 ఎపిసోడ్స్ అందుబాటులోకి వచ్చాయి. బహుశా వచ్చే ఏడాది రెండో సీజన్ ఉండొచ్చు.

(ఇదీ చదవండి: మేం విడాకులు తీసుకుని 14 ఏళ్లు.. కానీ ఇప్పటికీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement