'రామాయణ'కి రివ్యూ ఇచ్చిన 'వారణాసి' రాముడు | Mahesh Babu Review On Ramayana Movie, Praises Ranbir Kapoor, Sai Pallavi And Yash For Their Magical Performances, Post Goes Viral | Sakshi
Sakshi News home page

Ramayana - Mahesh Babu: 'రామాయణ'.. చాలా ఆనందంగా అనిపించింది

Nov 6 2026 12:24 PM | Updated on Nov 6 2026 12:47 PM

Mahesh Babu Reviewed Ramayana Movie

ఓ మాదిరి అంచనాలతోనే థియేటర్లలోకి వచ్చిన 'రామాయణ'.. మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అద్బుతమైన విజువల్స్ కట్టిపడేశాయని పలువురు నెటిజన్లు అంటున్నారు. ఈ మూవీ చూసిన హీరో మహేశ్ బాబు  కూడా తనదైన స్టైల్లో రివ్యూ ఇచ్చేశాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు.

(ఇదీ చదవండి: 'రామాయణ' తొలిరోజు కలెక్షన్ ఎన్ని కోట్లు?)

'చిన్నప్పటి నుంచి మనం విన్న కథలు.. వెండితెరపై నిజంగా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. రణ్‌బీర్, సాయిపల్లవి, యష్.. మీరు మ్యాజికల్. ఈ రేంజ్ స్కేల్ ఉన్న సినిమా తీసిన నమిత్ మల్హోత్రా, నితీశ్ తివారీకి వందనాలు. టీమ్ మొత్తానికి కంగ్రాచ్యులేషన్స్' అని మహేశ్ బాబు రాసుకొచ్చాడు.

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి రాముడు-సీతగా చేసిన ఈ సినిమాని యష్ పోషించిన రావణుడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించారు. ఇప్పుడొచ్చింది తొలి భాగం మాత్రమే. సీతాపహరణం ఎపిసోడ్‌తో తొలి భాగాన్ని ముగించారు. రామ-రావణ యుద్ధాన్ని రెండో భాగంలో చూపించబోతున్నారు. ఈ మూవీలో రావణుడి భార్యగా కాజల్, శూర్ఫనఖగా రకుల్ ప్రీత్ ఇలా చాలామంది స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు. తొలిరోజు ఈ చిత్రానికి రూ.130 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

అసలు విషయానికొస్తే 'రామాయణ'కి రివ్యూ ఇచ్చేసిన మహేశ్ బాబు.. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదలయ్యే 'వారణాసి' సినిమాలో రాముడిగా కనిపించనున్నాడు. మహేశ్ తనదైన ఆహార్యంతో రాముడిగా ఎలా చేస్తాడో చూడాలని అతడి అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు.

(ఇదీ చదవండి: ‘రామాయణం’ మూవీ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement