కోమాలో హీరో రజినీకాంత్ సోదరుడు | Actor Rajinikanth Brother Health Condition Update | Sakshi
Sakshi News home page

Rajinikanth Brother: మెట్లపై నుంచి పడిపోయిన రజనీ సోదరుడు

Nov 6 2026 8:37 AM | Updated on Nov 6 2026 8:47 AM

Actor Rajinikanth Brother Health Condition Update

రీసెంట్‌గా 'జైలర్ 2'తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న రజనీకాంత్.. గురువారం, బెంగళూరు వెళ్లారు. రాజరాజేశ్వరినగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోదరుడు సత్యనారాయణ రావ్ గైక్వాడ్‌ని పరామర్శించారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి జైలర్‌2.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఇదే.. అధికారిక ప్రకటన)

సత్యనారాయణరావ్.. నాలుగు రోజుల క్రితం ఇంట్లో మెట్ల మీద నుంచి అదుపుతప్పి పడిపోయారు. ఆయన తలభాగానికి దెబ్బ తగిలి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు తలకు శస్త్ర చికిత్స చేశారు. ఆయన కోమాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా కళ్లు తెరవలేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ రజనీకాంత్‌.. సోదరుడి దగ్గరకు వచ్చి వైద్యులని ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోదరుడిని పరామర్శించిన అనంతరం.. కనకపుర రోడ్డులోని రవిశంకర్‌ గురు ఆశ్రమానికి వెళ్లి కొంతసేపు గడిపారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement