ఓటీటీకి జైలర్ 2 ‍మూవీ.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..! | rajinikanth Jailer 2 Movie Ott Release date Locked | Sakshi
Sakshi News home page

Jailer 2 Movie Ott: ఓటీటీకి జైలర్ 2 ‍మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..!

Nov 4 2026 3:30 AM | Updated on Nov 4 2026 3:30 AM

rajinikanth Jailer 2 Movie Ott Release date Locked

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్‌ మూవీ జైలర్-2. గతంలో రిలీజైన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నెల్సన్ దిలీప్‌ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. దసరా కానుకగా ఈనెల 15న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇప్పటికే రూ.800 కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 125.25 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ వెయ్యి కోట్ల దిశగా దూసుకెళ్తోంది.

ఈ నేపథ్యంలోనే జైలర్-2 మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించిన న్యూస్ వైరలవుతోంది. ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా చేసుకున్న డీల్ ప్రకారం ఈ సినిమా నవంబర్ 12 లేదా 13న ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత డిజిటల్‌ ప్రీమియర్‌ ఉండేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా ఈ చిత్రంలో రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటించగా.. రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రల్లో కనిపించారు. మిథున్‌ చక్రవర్తి, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌ తదితరులు ఈ చిత్రంలో భాగమయ్యారు. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ నిర్మించింది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతాన్ని అందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement