'రామాయణ' తొలిరోజు కలెక్షన్ ఎన్ని కోట్లు? | Ramayana Movie Day 1 Worldwide Box Office Collections, Ranbir Kapoor And Sai Pallavi Film Crossed Rs 100 Crores, Check Latest Numbers | Sakshi
Sakshi News home page

Ramayana Movie Collections: బాక్సాఫీస్ దగ్గర రాముడికి కనకాభిషేకం.. తొలిరోజు వసూళ్లెంత?

Nov 6 2026 9:33 AM | Updated on Nov 6 2026 10:19 AM

Ramayana Movie Collection Day 1 Worldwide

వెండితెరపై రామాయణ కథని ఇప్పటికే చాలాసార్లు చూశాం. కాకపోతే భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో తీసిన లేటెస్ట్ సినిమా 'రామాయణ'. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి.. రాముడు, సీత పాత్రలు చేయగా కన్నడ ‍స్టార్ హీరో యష్.. రావణుడిగా ఆకట్టుకున్నాడు. గురువారం(నవంబర్ 05) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి తొలిరోజు కలెక్షన్ ఎంతొచ్చాయి?

(ఇదీ చదవండి: కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి షురూ.. ఫొటోలు వైరల్)

విడుదలకు ముందు 'రామాయణ'పై పెద్దగా హైప్ ఏర్పడలేదు. కానీ ఊహించని విధంగా థియేటర్లలో చూసిన ప్రేక్షకులు.. అద్భుతంగా చూపించారని దర్శకనిర్మాతలని మెచ్చుకుంటున్నారు. రావణుడిగా యష్ ఆహార్యం అదిరిపోయిందని కితాబిస్తున్నారు. తొలిరోజే టాక్ పాజిటివ్‌గా రావడంతో ప్రపంచవ్యాప్తంగా రూ.127 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.

ఒక్క హిందీలోనే రూ.47.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. కన్నడ నుంచి రూ.7.25 కోట్లు, తెలుగులో రూ.6 కోట్లు, తమిళంలో రూ.2.60 కోట్లు, మలయాళ నుంచి రూ.1.50 కోట్లు వసూళ్లు సాధించినట్లు సమాచారం. టాక్ పాజిటివ్‌గా వచ్చింది దానికి తోడు ఈ వీకెండ్ దీపావళి ఉంది కాబట్టి వసూళ్లు పెరిగే అవకాశమైతే ఉంది. కాకపోతే ఈ చిత్ర బడ్జెట్ రూ.2000 కోట్లు అని నిర్మాతలు చెప్పుకొన్నారు. బ్రేక్ ఈవెన్ రావాలంటే అంతకు మించిన వసూళ్లు రావాలి. లాంగ్ రన్‌లో ఎన్ని వందల లేదా వేల కోట్లు రాబడుతుందో చూడాలి?

(ఇదీ చదవండి: ‘రామాయణం’ మూవీ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement