ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు కాల భైరవ, హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్ వచ్చే నెలలోనే పెళ్లి చేసుకోనున్నారు. ఇందులో భాగంగానే వివాహానికి సంబంధించిన పనులు మొదలైపోయాయి. ఈ ఫొటోలని కావ్య తండ్రి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
(ఇదీ చదవండి: మెగా హీరో ఇంట పెళ్లి సందడి.. గ్రాండ్‌గా నిశ్చితార్థం)
కీరవాణి పెద్ద కొడుకు అయిన కాల భైరవ.. గాయకుడు, సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్‌గా పలు సినిమాలు చేసిన కావ్య కల్యాణ్ రామ్‌తో ప్రేమలో పడ్డాడు. ఇంట్లో వాళ్లని ఒప్పించి ఈ ఏడాది ఆగస్టు 31న తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. అప్పట్లోనే నిశ్చితార్థం కూడా జరిగినట్లు తెలుస్తోంది.
వచ్చే నెలలో పెళ్లి జరగనున్న సందర్భంగా ఆడపిల్ల ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. ఈ వేడుకకు కీరవాణి కుటుంబంతో పాటు రాజమౌళి, ఇతడి భార్య రమ కూడా పాల్గొని కాబోయే వధూవరుల్ని ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే టాలీవుడ్ లో రాబోయే నెలలో చాలానే శుభకార్యాలు జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మెగాహీరో సాయితేజ్, తన చిన్ననాటి స్నేహితురాలు కిరణ్మయితో నిశ్చితార్థం చేసుకోగా.. హీరో తేజా సజ్జా కూడా వచ్చే నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: 'సమ్మర్ హాలిడేస్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్)




