'గుప్పెడంత మనసు' సీరియల్‌తో తెలుగునాట గుర్తింపు తెచ్చుకున్న నటి జ్యోతిరాయ్.. హీరోయిన్‌గా చేసిన తెలుగు సినిమా 'కిల్లర్'. పూర్వాజ్ దర్శకత్వం వహించాడు. ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుంది. అయితే ఈ చిత్రంలో ట్విస్ట్ కనిపెడితే రూ.కోటి ఇస్తామని డైరెక్టర్ ఛాలెంజ్ చేశాడు. దీనిపై ట్రోల్స్ రాగా వాటిపై ఘాటుగా స్పందించాడు. ఇక్కడివరకు బాగానే ఉంది గానీ స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా ఈ ట్విస్ట్ కనిపెట్టలేరని అనడం చిత్రంగా అనిపించింది.
(ఇదీ చదవండి: 'రామాయణ' సినిమా ఫస్ట్ రివ్యూ)
ట్విస్ట్ కనిపెడితే రూ.కోటి ఇస్తామని ట్రోల్ చేయడంపై సీరియస్ అయిన దర్శకుడు పూర్వాజ్.. నేనేమైనా ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అన్నానా? కచ్చితంగా నేను సినిమా చూడమని అడిగానా? సక్సెస్ మీట్‌లో డబ్బులు ఇస్తాను అంటే 'అసలు సినిమా సక్సెస్ అవ్వాలిగా' అని అంటున్నారు. కనీసం మీ సినిమాకి కోటి రూపాయలు కలెక్షన్స్ అయినా వస్తాయా? అంటున్నారు. నా సినిమా సక్సెస్ అవుతుందో లేదో మీకెందుకు? ట్విట్టర్లో ఒక్కడికి ఫోటో పెట్టుకునే ధైర్యం ఉండదు అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
తనని ఓ ఇంటర్వ్యూలో కావాలనే కార్నర్ చేసేలా రాజమౌళి మీ సినిమా చూసినా ట్విస్ట్ కనిపెట్టగలరా అని ఓ జర్నలిస్టు అడిగారు. అవును ఆయన చూసినా కనిపెట్టలేరని పూర్వాజ్ అన్నాడు. ఎందుకంటే రాజమౌళి 'వారణాసి'తో బిజీగా ఉన్నారు. అలాంటి వ్యక్తికి సడన్‌గా మా చిత్రం చూపించి ట్విస్ట్ గెస్ చేయమంటే చేయలేరు కదా అని వివరణ ఇచ్చాడు.
రీసెంట్ టైంలో చిన్న సినిమాల దర్శకనిర్మాతలు హీరోలు.. ఇలాంటి సెన్సేషనల్ ఛాలెంజులు చేసి వార్తల్లో నిలుస్తున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. ఫైనల్‌గా మూవీ కంటెంట్ బాగుంటే పర్లేదు. ఒకవేళ అలా కాదంటే రివర్స్‌లో వచ్చే ట్రోలింగ్ తట్టుకోవాల్సి ఉంటుంది. మరి పూర్వాజ్.. ట్రోల్స్ అనే గండాన్ని దాటుతాడా లేదా అనేది చూడాలి? అలానే గురువారం(అక్టోబర్29) రాత్రి వేసే ప్రీమియర్లకు మాత్రమే రూ.కోటి బహుమతి ఉంటుంది.
(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' కోసం నేను ఒక స్టోరీ ఇస్తే.. వాళ్లొక స్టోరీతో తీశారు)


