'గేమ్ ఛేంజర్' కోసం నేను రియలస్టిక్ స్టోరీ రాశాను కానీ | Karthik Subbaraj Reacts On Game Changer Movie Story Issue | Sakshi
Sakshi News home page

Karthik Subbaraj: రామ్ చరణ్ వచ్చేసరికి స్టోరీనే మారిపోయింది

Oct 28 2026 12:41 PM | Updated on Oct 28 2026 12:44 PM

Karthik Subbaraj Reacts On Game Changer Movie Story Issue

'ఆర్ఆర్ఆర్' లాంటి ఆస్కార్ విన్నింగ్ మూవీ చేసిన తర్వాత రామ్ చరణ్ దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకుని చేసిన సినిమా 'గేమ్ ఛేంజర్'. గతేడాది సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని టాపిక్ వచ్చిన ప్రతిసారి మెగా ఫ్యాన్స్.. డైరెక్టర్ శంకర్‌ని తిట్టుకుంటారు. అయితే ఈ మూవీకి తాను ఓ కథ రాస్తే.. దాన్ని మార్చేశారని ప్రముఖ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదంతా బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు అస్సలు మిస్ కావొద్దు)

పిజ్జా, పెట్టా, మహాన్, జిగర్తాండ లాంటి సినిమాలు తీసిన కార్తిక్ సుబ్బరాజ్.. రీసెంట్‌గా 'డోరతి' సినిమా తీశాడు. ఇందులో హిజ్రాలని భిన్నమైన కోణంలో ప్రెజెంట్ చేసి ప్రేక్షకుల్ని మెప్పించాడు. దీని ప్రమోషన్లలో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో 'గేమ్ ఛేంజర్' టాపిక్ రాగా కార్తిక్ దీనిపై స్పందించాడు.

'నేను 'గేమ్ ఛేంజర్' కోసం ఓ రియలస్టిక్ స్టోరీ రాశాను. ఓ ఐఏఎస్ అధికారి, తన అధికారులతో కలిసి వ్యవస్థని ఎలా మార్చాడు అనేది గ్యాంగస్టర్ యాంగిల్‌లో రాశాను. ఇది శంకర్ సర్‌కి చెప్పగానే ఆయనకు ఇది నచ్చింది. స్క్రీన్ ప్లే రాసివ్వమన్నారు. అయితే నేను 'మహాన్' మూవీ ప్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉండి తర్వాత స్టోరీ గురించి పట్టించుకోలేదు. అయితే ఇది బిగ్ బడ్జెట్ మూవీగా మారి, రామ్ చరణ్ హీరోగా వచ్చేసరికి కథ రూపమే మారిపోయింది' అని కార్తిక్ సుబ్బరాజ్ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: 'రామాయణ' సినిమా ఫస్ట్ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement