అలాంటి మహిళలకు ఇదే నా స్ట్రాంగ్‌ వార్నింగ్‌: ఉపాసన | Upasana Konidela Sensational Comments On Women | Sakshi
Sakshi News home page

అలాంటి మహిళలకు ఇదే స్ట్రాంగ్‌ వార్నింగ్‌ : ఉపాసన

Oct 24 2026 4:36 PM | Updated on Oct 24 2026 4:40 PM

Upasana Konidela Sensational Comments On Women

హీరో రామ్‌చరణ్‌ సతీమణి, అపోలో హాస్పిటల్స్‌ సీఎస్సార్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ ఉపాసన కొణిదెల ‘ఫెస్టివల్‌ ఫర్‌ జాయ్స్‌’ఐదో వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మహిళలను ఉద్దేశించి ఆసక్తికరమైన కామెంట్స్‌ చేశారు. ఇప్పుడీ వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

ఓ వీక్‌ మగాడిని సంతోషపెట్టడం కోసం
‘చాలా మంది మహిళలకు మన సహాయం కావాల్సి ఉంది.  కానీ తమ ఎదుగుదల కోసం ఇతర మహిళలను తొక్కేసే ఆడవాళ్లు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. ఇది నేను గమనించిన పచ్చి నిజం. అలాంటి వారికి నేను ఒకటే చెప్తున్నా.. మీ సక్సెస్‌ కోసం లేదా ఓ వీక్‌ మగాడిని సంతోషపెట్టడం కోసం వేరొక మహిళ జీవితాన్ని అణిచివేయాలని అని చూడకండి’ అని చాలా సీరియస్‌గా ఉపాసన వార్నింగ్‌ ఇచ్చారు. 

సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్ ఆధ్వర్యంలో ఉన్న చాలా మంది పిల్లలు ఆ దుస్థితికి రావడానికి కారణం.. కొందరు మహిళలు  వారి ఆనందం కోసం ఇతర ఆడవాళ్లకు చేసిన అన్యాయమేనని ఉపాసన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఊపాసన చేసిన ఈ వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి.

(ఇదీ చదవండి: స్టార్‌ హీరోలకు ధీటుగా లేడీ సూపర్‌స్టార్‌ క్రేజ్‌)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement