రామ్ చరణ్ కొత్త సినిమా.. ఎట్టకేలకు తొలి అడుగు | Ram Charan New Movie With Sukumar Launch Latest | Sakshi
Sakshi News home page

RC 17 Movie: 'పెద్ది' తర్వాత చరణ్ సినిమా.. లేటెస్ట్ అప్‌డేట్

Oct 14 2026 7:26 PM | Updated on Oct 14 2026 7:57 PM

Ram Charan New Movie With Sukumar Launch Latest

'పెద్ది' సినిమా వచ్చి నెలలు దాటిపోయింది. సుకుమార్‌తో చేయాల్సిన కొత్త మూవీ ఎప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. దసరాకు లాంచ్ కానుందని రూమర్స్ వచ్చాయి. కానీ ఇంతలోనే టీమ్ నుంచి అప్‌డేట్ వచ్చేసింది. దర్శకుడు సుకుమార్ కొత్త ఆఫీస్ తీసుకున్నారు. అలా ఈ ప్రాజెక్ట్‌కి తొలి అడుగుపడింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మూడు ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: ఎ‍ట్టకేలకు ఓటీటీలోకి 'ద ఒడిస్సీ'.. అధికారిక ప్రకటన)

రామ్ చరణ్-సుకుమార్ గతంలో 'రంగస్థలం' చేశారు. ఇది 2018లో రిలీజైంది. తర్వాత పుష్ప టైంలో మళ్లీ ఈ కాంబోలో మూవీ ఉండనుందని అనౌన్స్ చేశారు. అప్పటినుంచి మెగా అభిమానులు ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం కోసం తన ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ని పక్కనబెట్టిన సుక్కూ.. అనిరుధ్‌తో పనిచేయబోతున్నాడని సమాచారం.

ప్రస్తుతం ఆఫీస్ తీసుకున్నారు. అయితే దసరా పండగకు ప్రాజెక్ట్ లాంచ్ కావొచ్చని అంటున్నారు. ఈ విషయంతో పాటు హీరోయిన్ ఎవరు? స్టోరీ ఏంటనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ మొదలుపెట్టినా సరే 2028లో లేదంటే 2029లోనే రిలీజ్ ఉంటుందేమో?

(ఇదీ చదవండి: మాజీ భార్యకు దగ్గరుండి పెళ్లి చేసిన 'స్పైడర్‌మ్యాన్')

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement