ఎ‍ట్టకేలకు ఓటీటీలోకి 'ద ఒడిస్సీ'.. అధికారిక ప్రకటన | Christopher Nolan The Odyssey Movie OTT Release Date Announced, Check Out Streaming Platform Details And Trailer | Sakshi
Sakshi News home page

The Odyssey OTT: నోలన్ బ్లాక్‌బస్టర్ సినిమా.. ఓటీటీలో ఎప్పుడంటే?

Oct 14 2026 4:28 PM | Updated on Oct 14 2026 4:56 PM

The Odyssey OTT Release Date Latest Update

హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ పేరు చెప్పగానే ఎన్నిసార్లు చూసినా సరే అర్థం కాని, అదే టైంలో వావ్ అనిపించే సినిమాలే గుర్తొస్తాయి. కొన్ని మూవీస్ తీసినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఈయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ చిత్రం 'ద ఒడిస్సీ'. ఈ ఏడాది జూలైలో రిలీజై దాదాపు రూ.15 వేల కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది.

(ఇదీ చదవండి: మాజీ భార్యకు దగ్గరుండి పెళ్లి చేసిన 'స్పైడర్‌మ్యాన్')

క్రిస్టోఫర్ నోలన్ చాలావరకు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలే చేశాడు. కానీ వేలఏళ్ల క్రితం పుస్తకంగా వచ్చిన ఒడిస్సియస్ రాజు కథని 'ద ఒడిస్సీ' మూవీగా థియేటర్లలోకి తీసుకొచ్చాడు. ఈ చిత్రం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ థియేటర్లకు మళ్లీ కళ వచ్చింది. కొన్నివారాల పాటు టికెట్స్ దొరకనంత క్రేజ్ వచ్చింది. అందరికీ తెలిసినా కథే అయినప్పటికీ నోలన్.. దీనిని ప్రెజెంట్ చేసిన తీరు మెప్పించింది.

జూలైలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. వచ్చే నెల అంటే నవంబరు 17 నుంచి రెంట్ పద్ధతిలో అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్ లాంటి తొమ్మిది ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఉచితంగా చూసేందుకు వచ్చే ఏడాదిలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. మరి అదెప్పుడు అనేది తెలియాల్సి ఉంది.

'ద ఒడిస్సీ' విషయానికొస్తే.. తన తెలివితేటలతో ట్రాయ్‌ రాజ్యాన్ని ఒడిస్సియస్‌ (మాట్‌ డామన్‌) ఓడిస్తాడు. పదేళ్లుగా సాగిన ట్రోజన్‌ యుద్ధానికి ముగింపు పలుకుతాడు. తర్వాత సైన్యంతో కలిసి తన రాజ్యం ఇథాకాకు సముద్రమార్గం ద్వారా పయనమవుతాడు. అతడి రాక కోసం భార్య పెనెలోప్‌ (అన్నీ హాథవే), కొడుకు టెలిమాకస్‌ (టామ్‌ హాలెండ్‌) ఎదురు చూస్తుంటారు. ఒడిస్సియస్‌ ఎప్పటికీ రాడని, తనని వివాహం చేసుకోవాలని పెనెలోప్‌ని ఆంటినస్‌ (రాబర్ట్‌ పాటిన్సన్‌) ఒత్తిడి చేస్తూ ఉంటాడు. తన శక్తియుక్తులతో ఆమెను వశం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు.

మరోవైపు పదిరోజుల్లో ఇథాకాకు చేరుకోవాల్సిన ఒడిస్సియస్‌కు సముద్ర ప్రయాణంలో ఎలాంటి ఆపదలు ఎదురయ్యాయి? ఈ క్రమంలో ఎవరెవరిని ఎదుర్కొన్నాడు? గ్రీకు దేవతలు అతనిపై ఎందుకు కోపం చూపించారు? భార్య, బిడ్డలని కలుసుకోవడానికి ఒడిస్సియస్‌కు పదేళ్లు ఎందుకు పట్టింది? చివరకు కలిశాడా? లేదా అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: హీరోయిన్‌కి బర్త్ డే 'గిఫ్ట్' ఇచ్చిన ప్రభాస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement