టాలీవుడ్లో ప్రభాస్ పేరు చెప్పగానే సినిమాల కంటే ముందు అతడిచ్చే ఆతిథ్యమే గుర్తొస్తుంది. ఎందుకంటే భీమవరంకి చెందిన ప్రభాస్.. భోజన ప్రియుడు. ప్రస్తుతం మూవీస్ చేస్తున్నాడు కాబట్టి డైట్ మెంటైన్ చేస్తుంటాడు గానీ లేదంటే మనసారా నచ్చినవన్నీ తింటాడు. అయితే ప్రభాస్ సినిమా షూటింగ్ అంటే తన ఇంటి నుంచి వచ్చే ఫుడ్‌తో టీమ్‌కి కడుపు నింపేస్తుంటాడు. ఇప్పుడు 'ఫౌజీ' హీరోయిన్‌కి అలాంటి సర్ప్రైజే ఇచ్చాడు.
(ఇదీ చదవండి: 'రాజాసాబ్' సినిమా.. అలా చేయకుండా ఉండాల్సింది: నిర్మాత)
'ఫౌజీ' మూవీలో హీరోయిన్గా చేస్తున్న ఇమాన్వి పుట్టినరోజు మంగళవారం(అక్టోబర్ 13) జరిగింది. దీనిని ఈమె సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ప్రభాస్ మాత్రం ఈమె కడుపు, మనసు నిండిపోయేలా చేశాడు. నాన్ వెజ్‌లో ఉన్న వెరైటీలన్నీ వండించి వాటిని ఇమాన్వికి పంపించాడు. వీటికి సంబంధించిన ఫొటో, వీడియో పోస్ట్ చేసిన ఈ బ్యూటీ.. కడుపు నిండిపోయింది ప్రభాస్ గారు అని పోస్ట్ పెట్టింది.
ఇప్పుడే కాదు గతంలో సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్ సినిమాలు చేస్తున్న టైంలోనూ హీరోయిన్లు శ్రద్ధాకపూర్, కృతి సనన్, పూజా హెగ్డేలని ఫుడ్‌తో కడుపు నింపేశాడు. ఇప్పుడు ఈ లిస్టులోకి తాజాగా ఇమాన్వి చేరింది.
(ఇదీ చదవండి: మాజీ భార్యకు దగ్గరుండి పెళ్లి చేసిన 'స్పైడర్‌మ్యాన్')


