ఈ ఏడాది సంక్రాంతికి చాలానే సినిమాలొచ్చాయి. అయితే వాటిలో మొదటగా ప్రభాస్ 'రాజాసాబ్' రిలీజైంది. తొలి ఆట నుంచి నెగిటివ్ టాక్ మూటగట్టుకుని ఫ్లాప్ అయింది. మరీ ముఖ్యంగా ఇప్పటికే దర్శకుడు మారుతిని ప్రభాస్ ఫ్యాన్స్, ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. అయితే ఈ మూవీ ఫలితంపై చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇప్పుడు స్పందించారు. సంక్రాంతికి కాకుండా వేరే టైంలో వచ్చుంటే రిజల్ట్ మరోలా ఉండేదని అన్నారు.
(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి క్రేజీ సినిమా.. మహిళలు తప్పక చూడాలి)
'సినిమా సైజ్-స్కేల్ బట్టి చూస్తే మంచి రిలీజే దక్కింది. కానీ సంక్రాంతి సీజన్‌లో రావడం వల్ల సరిగా ఫెర్ఫార్మ్ చేయలేదు. టికెట్ రేట్ల పెంపు కోసం ప్రయత్నించకుండా ఉండాల్సింది. దీని వల్ల సినిమా స్క్రీనింగ్ ఆలస్యమైంది. దీంతో చాలామంది ఫ్రస్టేట్ కావడం.. ఇలా చాలా కారణాలు ఉన్నాయి' అని నిర్మాత విశ్వప్రసాద్ చెప్పుకొచ్చారు.
అలానే 2028లో కచ్చితంగా ప్రభాస్‌తో మరో భారీ బడ్జెట్ మూవీ చేస్తామని విశ్వప్రసాద్ చెప్పుకొచ్చారు. ఈయన నిర్మించిన లేటెస్ట్ చిత్రం 'గరివిడి లక్ష‍్మి'. ఈ శనివారం(అక్టోబర్ 17) థియేటర్లలో రిలీజ్ కానుంది. బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష‍్మి జీవితం ఆధారంగా దీనిని తెరకెక్కించారు.
'రాజాసాబ్' విషయానికొస్తే.. ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పుడు విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. మారుతికి ప్రభాస్ అసలెందుకు అవకాశమిచ్చాడని అన్నారు. తీరా రిలీజ్ దగ్గరపడేసరికి ట్రైలర్, సాంగ్స్ చూసి బాగానే ఉండొచ్చేమో అనుకున్నారు. కానీ మూవీ మాత్రం ఏ మాత్రం మెప్పించలేకపోయింది. కామెడీ పరంగా పెద్దగా నవ్వించలేకపోయింది. ఇందులో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా చేశారు.
(ఇదీ చదవండి: 'ధురంధర్' సీరియస్ కాన్సెప్ట్.. అదే కథని కామెడీగా తీస్తే?)
Producer Vishwa Prasad says #TheRajasaab could have delivered a different result if it had been released outside the Sankranthi season. https://t.co/0hrpjhwRNc
— Filmyscoops (@Filmyscoopss) October 13, 2026


