ఈ మధ్య కాలంలో వైవాహిక బంధంలో రకరకాల వింతలు కనిపిస్తున్నాయి. ప్రియుడితో కలిసి భర్తని చంపడం అనే వార్తలు ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాం. మరోవైపు ప్రియుడితో భార్యకు పెళ్లి చేశాడు లాంటి వార్తలు కూడా అప్పుడో ఇప్పుడో వినిపిస్తూనే ఉంటాయి. సామాన్యుల విషయంలో జరిగిందిలే అనుకుంటే ఏదో అనుకోవచ్చు. 'స్పైడర్ మ్యాన్' ఫేమ్ హాలీవుడ్ నటుడు కూడా ఇలానే చేశాడు. తన మాజీ భార్యకు దగ్గరుండి మరొకరితో పెళ్లి చేశాడు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.
(ఇదీ చదవండి: 'రాజాసాబ్' సినిమా.. అలా చేయకుండా ఉండాల్సింది: నిర్మాత)
2002, 04, 07ల్లో వచ్చిన 'స్పైడర్ మ్యాన్' సినిమాల్లో పీటర్ పార్కర్ అని హీరో పాత్ర చేసిన నటుడు టోబీ మాగర్.. వేరే చిత్రాలు చేసినప్పటికీ 'స్పైడర్ మ్యాన్'గానే చాలా ఫేమస్ అయ్యాడు. 2007లో జెన్నిఫర్ మేయర్ అనే అమెరికన్ జ్యూవెల్లరీ డిజైనర్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ 2016 నుంచి వీళ్లిద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత గత నెలలోనే అధికారికంగా విడాకులు తీసుకున్నారు.
విడాకులు తీసుకుని కొన్నిరోజులు అయిందో లేదో జెన్నీఫర్.. నైజీరియన్ బిలియనీర్ వారసుడు అయిన అడెబాయో ఒగున్లెసీని పెళ్లి చేసుకుంది. గత శనివారం అమెరికాలోని హువాయ్ వేదికగా ఈ వివాహం జరగ్గా.. దీనిని జెన్నీఫర్ మాజీ భర్త, నటుడు టోబీ మాగర్ స్వయంగా దగ్గరుండి జరిపించాడు. ఈ ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఇది కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
(ఇదీ చదవండి: విడాకులు తీసుకున్న తెలుగు సీరియల్ హీరోయిన్)
If moving on was a photo. 👀 #SpiderMan star #TobeyMaguire officiates the wedding of his ex-wife Jennifer Meyer and Adebayo Ogunlesi. #Trending #Hollywood https://t.co/GAjERadCsE
— Filmfare (@filmfare) October 12, 2026


