పెద్ది మూవీ తర్వాత మెగా హీరో రామ్ చరణ్ నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ ఆర్సీ17. ఈ సినిమాకు పుష్ప డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. రంగస్థలం ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ టాక్ వైరలవుతోంది.
ఈ మూవీలో హీరోయిన్‌గా ఆమె పేరే వినిపిస్తోంది. దురంధర్‌తో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ సారా అర్జున్‌ను చెర్రీ సరసన తీసుకోవాలని భావిస్తున్నట్లు టాక్. జాన్వీ కపూర్ కంటే సారానే బెటర్ ఆప్షన్‌గా చూస్తున్నారని లేటేస్ట్ బజ్. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. జాన్వీతో సారాను పోలుస్తూ పోస్టర్స్ పోస్ట్ చేస్తున్నారు. ఒకవేళ హీరోయిన్‌గా సారా అర్జున్ ఫైనల్ అయితే తొలిసారి అరుదైన కాంబో టాలీవుడ్ అభిమానులను అలరించనుంది.

కాగా.. ఈ మూవీ అక్టోబర్ 25 లేదా 26న పూజా కార్యక్రమంతో సినిమా ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ కొద్ది వారాల తర్వాత మొదలయ్యే అవకాశం ఉంది.


