'రామాయణ' సినిమా ఫస్ట్ రివ్యూ | Ramayana Movie Premiere Review Los Angeles Show | Sakshi
Sakshi News home page

Ramayana Premiere Review: తొలి షో పడ్డ 'రామాయణ'.. ట్విటర్ టాక్ ఏంటి?

Oct 28 2026 10:58 AM | Updated on Oct 28 2026 11:11 AM

Ramayana Movie Premiere Review Los Angeles Show

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి.. రాముడు, సీతగా నటించిన సినిమా 'రామాయణ'. కన్నడ స్టార్ యష్.. రావణుడి పాత్ర చేశాడు. నమిత్ మల్హోత్రా రూ.1500 కోట్ల బడ్జెట్‌తో దీనిని నిర్మించినట్లు తెలుస్తోంది. నితీశ్ తివారీ దర్శకుడు. వచ్చే శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. అయితే పదిరోజుల క్రితమే అంటే భారతకాలమానం ప్రకారం మంగళవారం రాత్రి అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ప్రీమియర్ షో వేశారు. దీంతో మూవీ ఎలా ఉందనేది బయటకొచ్చింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు అస్సలు మిస్ కావొద్దు)

'రామాయణ' ప్రీమియర్ చూసిన పలువురు అమెరికన్స్.. సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. సినిమా బాగుందని తెగ మెచ్చుకుంటున్నారు. మరికొందరు మాత్రం విజువల్ ఎఫెక్ట్స్, స్టోరీ నెరేషన్ విషయంలో కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం మూవీలోని సన్నివేశాల్లో భారీతనం కనిపిస్తున్నప్పటికీ ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయిందని అంటున్నారు. ఇలా ప్రస్తుతానికైతే మిశ్రమ స్పందన వినిపిస్తోంది. వచ్చేవారం మన దేశంలో షోలు పడిన తర్వాత అసలు టాక్ ఏంటనేది తెలుస్తుంది.

(ఇదీ చదవండి: 7 ఏళ్లకే 12 భాషలు మాట్లాడుతున్న హీరోయిన్ అసిన్ కూతురు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement