ఓటీటీలోకి రాజమౌళి కొడుకు సినిమా.. అధికారిక ప్రకటన | Dont Trouble The Trouble Movie OTT Release Date | Sakshi
Sakshi News home page

Dont Trouble The Trouble OTT: ఫహాద్ ఫాంటసీ మూవీ.. ఓటీటీలోకి ఎప్పుడంటే?

Oct 28 2026 7:41 AM | Updated on Oct 28 2026 7:42 AM

Dont Trouble The Trouble Movie OTT Release Date

ఓవైపు 'వారణాసి' సినిమాతో బిజీగా ఉన్న రాజమౌళి, ఇతడి కొడుకు కార్తికేయ మరోవైపు నిర్మాతగా ఓ మూవీ చేశారు. దాన్ని థియేటర్లలోకి కూడా తీసుకొచ్చేశారు. ఇ‍ప్పుడా చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెలలోపే స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అప్‌డేట్ వచ్చేసింది. ఇంతకీ ఏంటా మూవీ? ఎందులోకి రానుంది?

(ఇదీ చదవండి: శోభనం జరగనివ్వని 'తోకచుక్క'.. మలయాళ థ్రిల్లర్ 'ధూమకేతు' ఓటీటీ రివ్యూ)

ఫహాద్ ఫాజిల్ తెలుగులో ఇదివరకే 'పుష్ప'లో షెకావత్ అని విలన్ రోల్ చేశాడు. కానీ హీరోగా చేసిన చిత్రం 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్'. శశాంక్ యేలేటి దర్శకుడు కాగా రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మించాడు. ఈనెల 02న థియేటర్లలోకి వచ్చింది. కానీ జనాల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఫాంటసీ ఎలిమెంట్స్ కనెక్ట్ కాలేదు. ఈ క్రమంలోనే ఈ శుక్రవారం(అక్టోబర్ 30) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు.

డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ విషయానికొస్తే.. సూరి (ఫహాద్ ఫాసిల్) చిన్న చిన్న మోసాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటాడు. అలా ఓ రోజు దివ్య (సారా పాలేకర్) అనే అమ్మాయి, ఆమె కుక్క స్నూపీ సూరికి ఎదురవుతాయి. సూరిని దివ్య ఓ మెజీషియన్ అనుకుంటుంది. సూరి మాత్రం ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి, కిడ్నాప్ చేశానని చెప్పి ఈజీగా డబ్బులు సంపాదించొచ్చని అనుకుంటాడు. కానీ సీన్ రివర్స్ అవుతుంది. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు అస్సలు మిస్ కావొద్దు)

దివ్య తల్లిదండ్రులు అసలు కనిపించకుండా పోయారని సూరికి తెలుస్తుంది. దివ్య మామ ప్రతాప్ (సౌరభ్ సచ్‌దేవా) మాత్రం సూరి, దివ్యని తన దగ్గరకు తీసుకొస్తే డబ్బులు ఇస్తానని ఒప్పుకుంటాడు. ఇంతలో సూరికి అసలు ట్విస్ట్ తెలుస్తుంది. ఇంతకీ అదేంటి? దివ్య అసలు కథేంటి? సూరికి ఏం జరిగింది? చివరకు ఏం జరుగుతుందనేదే మిగతా కథ.

ఈ సినిమాతో పాటు ఈ వీకెండ్ చాలానే సినిమాలు ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వాటిలో విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ 'బత్తా'తో పాటు సిగ్మా, ఇమ్మోర్టల్, అవరచన్ అండ్ బాయ్స్, లాంటి చిత్రాలతో పాటు అక్క, రుద్రవనం పీఎస్ సిరీస్‌లు చూడాలనే ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి.

(ఇదీ చదవండి: లిఫ్ట్ ఎక్కి గతాన్ని మార్చే అవకాశమొస్తే.. ఓటీటీలో తెలుగు థ్రిల్లర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement