బిగ్‌బాస్ 10: ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారంటే? | Bigg Boss 10 Telugu Day 51 Highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss 10 Telugu Day 51: ఈ సారి నామినేషన్లలో 8 మంది.. ఎవరు ఎలిమినేట్ అవుతారో?

Oct 28 2026 8:28 AM | Updated on Oct 28 2026 8:28 AM

Bigg Boss 10 Telugu Day 51 Highlights

ఎనిమిదో వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. గతవారం జరిగిన టాస్క్‌ల్లో గెలిచి గ్రీన్‌లోకి వెళ్లిన గోట్స్‌కి రెండు వారాలు సేవ్ అయ్యే అవకాశం దొరికింది. దీంతో మిగిలిన వాళ్లలో వాళ్లే నామినేట్ చేసుకున్నారు. అలా ఈసారి మొత్తం ఎనిమిది మంది లిస్టులోకి వచ్చారు. ఇంతకీ బిగ్‌బాస్ 10లో 51వ రోజైన మంగళవారం(అక్టోబర్ 27) అసలేం జరిగింది? అనేది చూద్దాం.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు అస్సలు మిస్ కావొద్దు)

నిన్న గ్రీన్ కేటగిరీలోని గోట్స్ నామినేషన్స్ చేశారు. ‍అయితే త్రిగుణ్.. వర్షిణిని నామినేట్ చేయడం గురించి ఇద్దరూ బాధపడ్డారు. దీని గురించి చర్చించుకున్నారు. వర్షిణి మాట్లాడుతూ ఇదేనా నువ్వు , నాకు తెలిసిన త్రిగుణ్.. నువ్వు కాదు అని చెప్పింది. అర్ధం చేసుకోవా వర్షిణి అని త్రిగుణ్ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. త్రిగుణ్ ఏడుస్తుంటే రోహిత్ ఫుల్‌గా నవ్వుకున్నాడు. మరోవైపు గోట్‌లో జరిగిన వెయిట్స్ గేమ్ గురించి అందులో ఎవరెవరు ఎలా ఆడారో నరేశ్, రాంప్రసాద్ కామెడీ స్కిట్ చేసి అందరినీ చాలా నవ్వించారు. తర్వాత నామినేషన్స్ ఎక్కడి నుంచి ఆపారో అక్కడి నుంచి మళ్లీ మొదలైంది. గ్రీన్‌లోని గోట్స్ జడ్జిలుగా ఉండగా.. తొలుత ఎల్లో లెవల్‌లో ఉన్నవాళ్లలో ముగ్గురికి నామినేషన్ వేసే అవకాశం దక్కింది. ఎవరు నామినేషన్ వేయాలి అని గ్రీన్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎల్లో వాళ్ళు ఇద్దర్ని నామినేట్ చేయాలి. వాళ్ళు చెప్పిన కారణాలు విని గ్రీన్ జడ్జిలు ఒకటి ఫైనల్ చేయాలి.

తొలుత వచ్చిన నరేశ్.. ఝాన్సీ, వర్షిణిలని నామినేట్ చేశాడు. వర్షిణి గేమ్స్ ఆడట్లేదు. తొందరగా గివ్-అప్ ఇచ్చేస్తుందని కారణాలు చెప్పాడు. దీంతో నాకు సర్జరీ అయిందని వర్షిణి వివరణ ఇచ్చుకుంది. ఎక్కువ ఏడుస్తున్నావు, బాగా ఆడాలని అనుకోవట్లేదని చెప్పి నామినేషన్ చేశాడు. జడ్జిలు వర్షిణిని ఫైనల్ చేశారు. తర్వాత వచ్చిన శివ్.. సుధీర్, వంశీలని నామినేట్ చేశాడు. వంశీ గురించి మాట్లాడుతూ ముకేశ్ గతంలో చేసిన నామినేషన్స్ ఉదాహరణగా చెప్తుంటే ముకేశ్ వచ్చి పెద్ద గొడవ పెట్టుకున్నాడు. కట్ చేస్తే సుధీర్ నామినేషన్‌ని జడ్జిలు ఫైనల్ చేశారు. తర్వాత రాంప్రసాద్ వచ్చాడు. ఇతడు శివ్, శ్వేతలని నామినేట్ చేశాడు. వీళ్లని శివ్‌ని నామినేట్ చేస్తున్నట్లు జడ్జిలు వెల్లడించారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: డబుల్ ఎలిమినేషన్.. రెమ్యునరేషన్ ఎంతిచ్చారు?)

అనంతరం రెడ్ టీమ్‌లో ఉన్నవాళ్లకు ఒకరినే నామినేట్ చేసే అవకాశం లభించింది. అందులో ఎవరో ఒకరిని గ్రీన్ జడ్జిలు ఫైనల్ చేయాలి. తొలుత రోహిత్, రామకృష్ణలని పిలిచారు. రోహిత్.. నరేశ్‌ని, రామకృష్ణ.. వర్షిణిని నామినేట్ చేశాడు. రామకృష్ణ వర్షిణిని చేసిన నామినేషన్‌ని జడ్జిలు ఓకే చేశారు. తర్వాత ఝాన్సీ, శ్వేత వచ్చారు. వరసగా శివ్, ఝాన్సీని నామినేట్ చేశారు. వీరిలో శ్వేత.. ఝాన్సీని చేసిన నామినేషన్ ఫైనల్ చేశారు.

ఇలా ఈ రెండు రోజులు జరిగిన నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత చివరగా ఝాన్సీ, రోహిత్, రామకృష్ణ, సుధీర్, రాంప్రసాద్, వర్షిణి, శివ్ నామినేషన్స్‌లో నిలిచారు. శ్వేత, నరేశ్, వంశీ ఈ లిస్టులో లేరు. వీరిలో ఎవరో ఒకరిని గ్రీన్‌లోని గోట్స్ నామినేట్ చేయాలని బిగ్‌బాస్ చెప్పడంతో వంశీ పేరు చెప్పారు. మొత్తంగా ఈ వారం ఝాన్సీ, రోహిత్, రామకృష్ణ, సుధీర్, రాంప్రసాద్, వర్షిణి, శివ్, వంశీ నామినేట్ అయ్యారు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.

(ఇదీ చదవండి: రోహిత్‌తో నువ్వు కూడా అదే ఉద్దేశంతో ఉన్నావా? షాలినికి ఇచ్చిపడేసిన శివాజీ)

(ఇదీ చదవండి: ఓటీటీలోకి రాజమౌళి కొడుకు సినిమా.. అధికారిక ప్రకటన)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement