రోహిత్‌తో నువ్వు కూడా అదే ఉద్దేశంతో ఉన్నావా? | Bigg Boss 10 Telugu Shalini Eliminated And Buzz Interview | Sakshi
Sakshi News home page

Shalini Bigg Boss Buzz: సమాధానం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుంది!

Oct 26 2026 10:56 AM | Updated on Oct 26 2026 11:17 AM

Bigg Boss 10 Telugu Shalini Eliminated And Buzz Interview

బిగ్‌బాస్ లాంటి షోలో అవకాశం కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. అగ్నిపరీక్ష ద్వారా అలాంటి ఛాన్స్ షాలినికి వచ్చింది. హౌస్‌లోకి వచ్చిన తర్వాత గేమ్స్ ఆడి, టాస్క్‌లు గెలిచి నిలబడాల్సింది పోయి రోహిత్‌తో రొమాన్స్ చేసుకోవడానికే టైమ్ అంతా కేటాయించింది. సీక్రెట్ రూంలోకి పంపించి తిరిగి హౌస్‌లోకి తీసుకొచ్చినా సరే ఈమెలో ఏ మాత్రం మార్పు రాలేదు. దీంతో ఈమెతో ఇక వేస్ట్ అని బిగ్‌బాస్ వదిలించుకున్నాడు.

(ఇదీ చదవండి: రాజకీయ ఎంట్రీపై ప్రశ్న.. త్రిష ఏం చెప్పిందంటే?)

షాలిని హౌస్‌లో ఉన్నప్పుడు ప్రవర్తించిన తీరు, మాట్లాడిన మాటల పట్ల విపరీతమైన నెగిటివిటీ ఏర్పడింది. ఈమెకి ఓట్లు వేసింది తక్కువ మంది. కానీ తిట్టుకున్న వాళ్లే ఎక్కువ మంది. ఈమె వెళ్లిపోయింది ఇక బిగ్‌బాస్ ప్రశాంతంగా చూడొచ్చనుకునేవాళ్లే చాలామంది ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలిమినేట్ అయిన తర్వాత బజ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులోనే యాంకర్ శివాజీ.. హౌస్‌లో ప్రవర్తించిన విధానం, వదిలిన మాటల గురించి ఎలిమినేట్ అయి వచ్చినవాళ్లని ప్రశ్నలు అడుగుతాడు.

ఇలాంటివే షాలినిని కూడా శివాజీ అడిగాడు. ప్రేక్షకులు అడిగిన 28 ప్రశ్నలు ఇవి అని పేపర్ చూపించిన ఇతడు.. ఎక్కడి నుంచి మొదలు పెడదాం. బ్యాక్ బిచింగ్ నుంచి మొదలుపెడదామా? గుసగుసల గురించి అడుగుదామా? రోహిత్ బాబు గురించి అడగాలా? అని  అన్నాడు. సీక్రెట్ రూంలోంచి బయటకు వచ్చిన వారిలో ఒకరు విన్నర్, ఇంకొకరు రన్నర్ అయ్యారు. నువ్వు మాత్రం అదే వారంలో బయటకు వచ్చావ్ అని షాలిని పరువంతా శివాజీ తీసేశాడు.

వైల్డ్ ఫైర్స్ వచ్చాక రోహిత్‌కి బజ్ ఉంది కాబట్టి భజన చేస్తున్నారని అన్నావ్. నువ్వు కూడా అదే ఉద్దేశం కారణంగా రోహిత్‌తో ఉన్నావా? అని షాలినిని శివాజీ ప్రశ్నించాడు. మీ బాండింగ్‌ని విడగొట్టాలని చూశారాని అన్నావ్. విడగొడితే విడిపోయే బాండా మీది? అని కౌంటర్ వేశాడు.    మా నాన్న ఒక మాట చెప్పేవాడు అని శివాజీ ఏదో చెబుతుండగానే.. ఇక చాలు కట్ చేయండి అన్నట్టుగా సైగ చేసిన షాలిని ఏడ్చేస్తుంది. నేను ముందే నా గేమ్ ప్లాన్ మార్చాల్సింది, అనవసరంగా ఇక్కడిదాకా తెచ్చుకున్నా అని వెక్కి వెక్కి ఏడ్చేసింది. అయితే ప్రశ్నలకు ధీటుగా సమాధానాలు చెప్పాల్సింది పోయి ఇలా ఏడ్చి సింపతీ చూపించడమేంటో? అని నెటిజన్లు అంటున్నారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: షాలిని ఎలిమినేట్.. చివరి నిమిషంలోనూ రొమాన్స్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement