బిగ్‌బాస్ 10: షాలిని ఎలిమినేట్.. చివరి నిమిషంలోనూ రొమాన్స్ | Bigg Boss 10 Telugu Day 49 Highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss 10 Day 49: షాలిని.. ఈ మాత్రం దానికి హడావుడి ఎందుకో?

Oct 26 2026 10:28 AM | Updated on Oct 26 2026 10:38 AM

Bigg Boss 10 Telugu Day 49 Highlights

చాలామంది అనుకున్నట్లే బిగ్‌బాస్ 10వ సీజన్ నుంచి ఏడోవారం ఇద్దర్ని ఎలిమినేట్ చేసేశారు. వాళ్లే దక్షి, షాలిని. వైల్డ్ కార్డ్‌లా గేమ్ పరంగా మెప్పించలేకపోవడంతో హౌస్ నుంచి బయటకొచ్చేసింది. మరి షాలినిది మాత్రం షాకింగ్ అని చెప్పొచ్చు. ఇంతకీ బిగ్‌బాస్‌లో 49వ రోజైన ఆదివారం(అక్టోబర్ 25) అసలేం జరిగింది? అనేది చూద్దాం.

(ఇదీ చదవండి: రాజకీయ ఎంట్రీపై ప్రశ్న.. త్రిష ఏం చెప్పిందంటే?)

ఎల్లో, గ్రీన్ జోన్‌లో ఉన్నా నామినేషన్స్‌లో ఉండటం వల్ల వర్షిణి, శివ్‌లకు ఆడియెన్స్ ఓట్లు వేశారా? సేఫ్ చేశారా? లేదా? అన్నది నాగ్ తెలిపాడు. ఈ ఇద్దరూ సేఫ్ అయ్యారని నాగ్ ప్రకటించడంతో ఆదివారం ఎపిసోడ్ మొదలైంది. కాసేపటి తర్వాత దక్షి ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. స్టేజీపైకి వచ్చిన తర్వాత ఎక్కువ విను అని నీతూకి, ఎక్కువగా అబ్జర్వ్ చేయ్ అని అమన్‌కి, మాటలు కంట్రోల్‌లో పెట్టుకో అని త్రిగుణ్‌కి, ఇంకా మాట్లాడు నాలానే ఉంటే బయటకు వస్తావ్ అని శ్వేతకు సలహా ఇచ్చింది.

ఇక రెడ్ జోన్‌లోని ఏడుగురిలోంచి ఎల్లో జోన్‌లో ఉన్న నలుగురు సేవ్ చేస్తారు. శివ్ శ్వేతని, రాంప్రసాద్ ఝాన్సీని, వర్షిణి సుధీర్‌ని, నరేశ్ వంశీని సేఫ్ చేస్తారు. మిగిలిన రోహిత్, షాలిని, ఆర్కేలకు గ్రీన్ జోన్‌లో ఉన్న ఐదుగురు ఎగ్జిట్ బ్యాడ్జ్ పెట్టాలి. దీంతో నీతూ, దేబ్జానీ షాలినికి... ముకేశ్, అమన్ ఆర్కేకి బ్యాడ్జ్ పెట్టారు. చివరగా త్రిగుణ్.. షాలినికి బ్యాడ్జ్ పెట్టాడు. అలా షాలిని ఎలిమినేట్ అయింది. బయటకొచ్చే ముందు కూడా రోహిత్, షాలిని రొమాన్స్ విషయంలో తగ్గలేదు. గేట్ చివరి వరకు వచ్చినా గానీ మళ్లీ వెనక్కి పిలిచిన రోహిత్, షాలినికి హగ్ ఇచ్చాడు. షాలిని ఏమో చెవిలో ఐ లవ్యూ అని గుసగుసలాడింది.

నాకు రోహిత్ విన్ అవ్వాలని ఉందని స్టేజీపైకి వచ్చిన తర్వాత షాలిని చెప్పింది. షాలిని వెళ్తుంటే నాగ్ మళ్లీ పిలిచాడు. దీంతో హౌస్‌లోని కంటెస్టెంట్స్ ఆశ్చర్యపోగా.. ఏంటి రాంప్రసాద్ షాక్ అయ్యావా అని నాగ్ కౌంటర్ వేశాడు. మైక్ కోసమే షాలినిని నాగ్ పిలిచాడు. వచ్చేవారం 'అల్టిమేట్ గోట్' అనే థీమ్‌తో సాగనుందని నాగ్ చెప్పాడు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. షాలినిని ఎలిమినేట్ చేసే ఉద్దేశం బిగ్‌బాస్‌కి ఉన్నప్పుడు ఈమెని సీక్రెట్ రూంలో పెట్టి, తిరిగి హౌస్‌లోకి తీసుకొచ్చి హంగామా ఎందుకు చేశారో ఏంటో?

(ఇదీ చదవండి: 3500 మంది మహిళలతో ధనుష్ మీటింగ్.. ఏంటి విషయం?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement