ఆర్‌ఆర్‌ఆర్‌ కంటే వారణాసి పెద్ద సినిమా | SS Rajamouli says Varanasi is five to six times bigger than 'RRR | Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌ఆర్‌ కంటే వారణాసి పెద్ద సినిమా

Oct 25 2026 5:56 AM | Updated on Oct 25 2026 5:56 AM

SS Rajamouli says Varanasi is five to six times bigger than 'RRR

– రాజమౌళి 

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కన్నా ‘వారణాసి’ సినిమా చాలా పెద్దది అంటున్నారు రాజమౌళి.  మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వారణాసి’. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమార ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్‌ఎస్‌ కార్తికేయ, కేఎల్‌ నారాయణ నిర్మించిన ఈ టైమ్‌ ట్రావెల్‌ అండ్‌ మైథలాజికల్‌ యాక్షన్‌ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న రిలీజ్‌ కానుంది. కాగా, బ్రెజిల్‌లో జరుగుతున్న 50వ సావో పాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొన్న రాజమౌళి ఆ వేదిక పై ‘వారణాసి’ గురించి మాట్లాడుతూ– ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాను 315 రోజుల్లో చిత్రీకరించాం.

 ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కన్నా ‘వారణాసి’ ఐదారు రెట్లు పెద్ద సినిమా. అయితే ‘వారణాసి’ని మేం 275 రోజుల్లోనే పూర్తి చేశాం. ఆ 40 రోజుల షూటింగ్‌ సమయాన్ని మేం ఆదా చేశాం. ‘వారణాసి’ షూటింగ్‌ ప్రారంభించడానికి ముందే చాలా పేపర్‌ వర్క్‌ చేశాం. ప్రిపరేషన్‌ను పక్కాగా ప్లాన్‌ చేశాం. ‘వారణాసి’ పెద్ద సినిమా అయినప్పటికీ పక్కా ప్లాన్‌తో షూటింగ్‌ సమయాన్ని ఆదా చేయగలిగాం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా షూటింగ్‌ అనుభవం ఇలా ‘వారణాసి’ చిత్రీకరణకు తక్కువ సమయం పట్టేలా చేసింది’’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement