14ఏళ్లకే తల్లిని మించిన ఐశ్వర్య కూతురు.. ఫొటోలు వైరల్‌ | Aaradhya Bachchan Looks Taller Than Mom Aishwarya Rai in New Family Photos | Sakshi
Sakshi News home page

Aaradhya Bachchan: తల్లి కంటే పొడవుగా ఆరాధ్య.. వైరల్‌గా ఫొటోలు

Oct 24 2026 6:41 PM | Updated on Oct 24 2026 7:06 PM

Aaradhya Bachchan Looks Taller Than Mom Aishwarya Rai in New Family Photos

బాలీవుడ్‌ నటి ఐశ్వర్యారాయ్‌ కుమార్తె ఆరాధ్య బచ్చన్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. తన కజిన్‌ శివాన్ష్‌ రాయ్‌ పుట్టినరోజు వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేసింది. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఐశ్వర్య వదిన శ్రిమా రాయ్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ వేడుకల్లో ఐశ్వర్య తన సోదరుడు ఆదిత్య రాయ్‌, తల్లి వృందా రాయ్‌, వదిన శ్రిమా రాయ్‌, కుమార్తె ఆరాధ్యతో కలిసి కనిపించింది. పుట్టినరోజు కేక్‌ కట్‌ చేస్తున్న సమయంలో కుటుంబ సభ్యులంతా కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఐశ్వర్య నీలం రంగు చొక్కా, జీన్స్‌లో కనిపించగా.. ఆరాధ్య కూడా డెనిమ్‌ దుస్తుల్లో మెరిసింది.

ఐశ్వర్య కంటే..
అయితే ఈ ఫొటోల్లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఆరాధ్య ఎత్తు. 14 ఏళ్ల ఆరాధ్య తన తల్లి ఐశ్వర్య కంటే పొడవుగా కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ఐశ్వర్య కంటే ఆమె కూతురు ఎలా ఇంత పొడవుగా కనిపిస్తోంది?’ అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. మరికొందరు అందమైన కుటుంబం అంటూ ప్రశంసిస్తున్నారు.

ఇక ఐశ్వర్య సినిమాల విషయానికొస్తే.. ఆమె చివరిగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌: 2’లో కనిపించారు. ఇటీవల 2026లో జరిగిన లోరియల్‌ పారిస్‌ ఫ్యాషన్‌ షోలోనూ ర్యాంప్‌పై సందడి చేశారు.

(ఇదీ చదవండి: అలాంటి మహిళలకు ఇదే నా స్ట్రాంగ్‌ వార్నింగ్‌: ఉపాసన)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement