వారణాసి బాణాసంచా కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం | Several Feared Trapped After Explosion In Firecracker Factory In Varanasi | Sakshi
Sakshi News home page

వారణాసి బాణాసంచా కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం

Oct 15 2026 6:45 PM | Updated on Oct 15 2026 6:57 PM

Several Feared Trapped After Explosion In Firecracker Factory In Varanasi

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు  సంభవించింది. ఈ పేలుడు ధాటికి భవనంమొత్తం పూర్తిగా కూలిపోయింది. ఈ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.  వారణాసిలోని సారనాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగ్ తలాబ్ ప్రాంతంలో ఈ పేలుడు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ప్రాణనష్టం, గాయపడిన వారిన సంఖ్య, ప్రమాదానికి గల కారణాలపై పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది. 

ఈ ప్రమాదంపై స్పందించిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది భారీగా మోహరించి సహాయక చర్యల్ని చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ కూడా రంగంలోకి దిగింది.  ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు ఇద్దరిని రక్షించారు.గాయపడిన వారికి సరైన చికిత్స అందేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 
ఇదీ చదవండి : చికాగోలో సామూహిక అత్యాచారం కలకలం : ‘నా టర్న్’ఎపుడు‌ అంటూ రచ్చ?!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement