బిగ్‌బాస్ 10: ముకేశ్‌పై దేబ్జానీ ప్రతీకారం.. త్రిగుణ్ ఎమోషనల్ | Bigg Boss 10 Telugu Day 60 Episode Highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss 10 Telugu Day 60: ఫ్యామిలీ ఎమోషన్స్.. బిగ్‌బాస్ గేమ్ స్టార్ట్స్

Nov 6 2026 10:54 AM | Updated on Nov 6 2026 11:03 AM

Bigg Boss 10 Telugu Day 60 Episode Highlights

ఫ్యామిలీ వీక్ కోసం ఇప్పటినుంచే బిగ్‌బాస్ గేమ్ స్టార్ట్ చేశాడు. ఎవరి కుటుంబం.. హౌస్‌లోకి రావాలో నిర్ణయించుకోవడంలో భాగంగా కంటెస్టెంట్స్ మధ్య గేమ్స్ పెట్టి టెన్షన్ పెంచేశాడు. ఇంతకీ బిగ్‌బాస్ 10లో 60వ రోజైన గురువారం(నవంబర్ 05) అసలేం జరిగింది? ఈ పోటీలో ఎవరు ఎవరిపై గెలిచి ప్రతీకారం తీర్చుకున్నారు?

(ఇదీ చదవండి: కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి షురూ.. ఫొటోలు వైరల్)

గేమ్ పూర్తయిన తర్వాత త్రిగుణ్‌తో నీతూ గొడవ పడింది. తనని మోసం చేశారని సీరియస్ అయింది. ఈ గొడవ తర్వాత గేమ్‌లో గెలిచిన వంశీకి వచ్చే వారం ఫ్యామిలీ వీక్ ఉంటుందని బిగ్‌బాస్ ప్రకటించాడు. అలానే వర్షిణి ఫ్యామిలీ ఫొటో క్రష్ చేయమని చెప్పాడు. దీంతో వర్షిణి తన కుటుంబం ఫొటో పట్టుకొని ఏడ్చింది. అమన్‌ త్రిగుణ్‌తో నీ పేరే రాశానని చెప్పడంతో అలా ఎలా రాస్తాడు? నా కూతురు వస్తే మొదట తనే ఎత్తుకుంటా అన్నాడు. ఇలా చేయడం నాకు ఏదోలా ఉంది అని త్రిగుణ్.. శివ్, నరేశ్‌తో ఇదంతా చెప్పుకొని బాధ పడ్డాడు.

ఇక బిగ్‌బాస్ మరో పోటీ కోసం ఐదుగురిని ఎంచుకోమన్నాడు. దీంతో త్రిగుణ్, దేబ్జానీ, రాంప్రసాద్, నరేశ్, శివ్ ఆటకు రెడీ అయ్యారు. గేమ్‌లో భాగంగా గార్డెన్‌ ఏరియాలోని ఓ బంతిని తీసుకుని ఓ కేసులో నుంచి విసిరి మరో  చోట నుంచి పరుగున వెళ్లాలి. తర్వాత గోల్ చేయాలి. ఇది చేసిన వాళ్లు ఓ బల్బ్‌ని తీసుకొని వెలిగించాలి. ఈ పోటీలో ఐదుగురు.. సపోర్ట్స్‌ని ఎంచుకోవాలి. దీంతో త్రిగుణ్ సుధీర్‌ని, శివ్ శ్వేతని, దేబ్జానీ అమన్‌ని, రాంప్రసాద్‌ ముకేశ్‌ని, నరేశ్‌ వంశీని తీసుకున్నారు. రివేంజ్‌ తీసుకోవాల్సిన వారి పేరు రాయాలనుకుంటే రాయొచ్చు అని బిగ్‌బాస్ చెప్పడంతో త్రిగుణ్, రాంప్రసాద్, నరేశ్‌.. అమన్‌ పేరు, దేబ్జానీ ముకేశ్ పేరు రాసింది.

సంచాలకురాలు వర్షిణి.. బంతి విసిరితే పోటీలో ఉన్న ఐదుగురిలో సదరు బంతి దొరికిన వాళ్లు.. దాన్ని తీసుకుని సొరంగం గుండా వచ్చి బాస్కెట్ బంతిని గోల్‌లో వేయాలి. కరెక్ట్‌గా వేసిన వాళ్లకి ఐదు అవకాశాలు, సరిగా వేయకపోతే సంచాలకురాలు మరొకరికి బంతి అందజేస్తుంది. వాళ్లు మూడు అవకాశాల్లో వేయాలి. ఎవరూ తనకు సపోర్ట్ చేయడం లేదని అనడంతో దేబ్జానీకి అంతా అవకాశమిస్తారు. ఈమె సపోర్టర్ అమన్ సరిగా బంతిని వేయలేకపోతాడు. తర్వాత శివ్, త్రిగుణ్‌ని ఆపడానికి దేబ్జానీ, నరేశ్ కష్టపడతారు. చివరకు త్రిగుణ్‌, శివ్‌కి టై అవుతుంది. చివరగా త్రిగుణ్ విజేతగా నిలుస్తాడు.

పోటీలో గెలవడంతో త్రిగుణ్ ఫ్యామిలీ వీక్‌కి సెలక్ట్ అవుతాడు. త్రిగుణ్, అమన్ ఫ్యామిలీ ఫొటో పట్టుకొని నా కూతురు వస్తే మొదట నువ్వే ఎత్తుకుంటా అన్నావ్.. అలాంటి నువ్వే నా ఫ్యామిలీ రాకూడదని నా పేరు రాశావ్.. అది నేను తీసుకోలేకపోతున్నా.. నీతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యా నువ్వు ఇలా చేశావ్ తీసుకోలేకపోతున్నా అని చెప్పి భావోద్వేగానికి గురయ్యాడు. ఇక బిగ్‌బాస్ మరో టాస్క్ పెట్టి ముగ్గురే ఆడాలని చెప్పగా దేబ్జానీ, నరేశ్, నీతూ ఆడారు. ఇందులో గెలిచిన దేబ్జానీ.. ముకేశ్‌కి ఫ్యామిలీ వీక్ తీసేస్తూ ప్రతీకారం తీర్చుకున్నానని చెప్పింది. దీంతో ముకేశ్.. ఈ పని ఇంకెవరు చేసినా ఏడ్చేవాడిని. నువ్వు కాబట్టి ఏడ్వడం లేదు. అయినా సరే నీ ఫ్యామిలీ వస్తే నేనే వెళ్లి ఆహ్వానిస్తానని చెప్పాడు. అలా గురువారం ఎపిసోడ్ ముగిసింది.

(ఇదీ చదవండి: 'రామాయణ' తొలిరోజు కలెక్షన్ ఎన్ని కోట్లు?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement