బిగ్‌బాస్ 10లో ఎనిమిదో వీకెండ్ ఊహించని ట్విస్టులు కనిపించాయి. ఝాన్సీ ఎలిమినేట్ అయిందని ప్రేక్షకులు తేరుకునేలోపు మరో ట్విస్ట్ ఇచ్చి రోహిత్‌ని బయటకు పంపించారు. కనీసం ఏవీ కూడా ప్లే చేయలేదు. ఇంతకీ హౌస్‌లో 56 రోజైన ఆదివారం(నవంబర్ 01) ఎపిసోడ్‌లో అసలేం జరిగింది?
(ఇదీ చదవండి: రోహిత్ 'సైకో' ప్రవర్తన.. నాగ్ ఎందుకు మాట్లాడలేదు?)
ఎలిమినేట్ అయిన ఝాన్సీ జర్నీ వీడియోతో ఆదివారం ఎపిసోడ్ మొదలైంది. ఓ ఐదు సామెతలు ఎవరికి వర్తిస్తాయి అని ఆమెని అడగ్గా.. కుక్క తోక వంకర రోహిత్‌కి.. ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు దేబ్జానీకి.. గోరంతదాన్ని కొండంత చేస్తారు త్రిగుణ్‌కి.. మెరిసేదంతా బంగారం కాదు ముకేశ్‌కి.. ఇంట్లో పులి వీధిలో పిల్లి నరేశ్‌కి ఇచ్చింది. తర్వాత కాసేపటికి దేబ్జానీతో త్రిగుణ్ మాట్లాడుతూ వర్షిణి, ముకేశ్, రోహిత్ తన గురించి అన్న మాటలు చెప్పాడు. నా గురించి వర్షిణి మాట్లాడిన మాటలు విని తనని ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అనిపించింది అని త్రిగుణ్ తన కోపాన్ని బయటపెట్టాడు.
తర్వాత పెట్టి హుక్ స్టెప్ డ్యాన్స్ పోటీలో త్రిగుణ్, రాంప్రసాద్ బ్యాచ్ గెలిచింది. ఇక రెడ్ జోన్‌లో ఉన్న రామకృష్ణ, శ్వేత, రోహిత్‌లతో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పిన నాగ్.. ముగ్గురిలో ఎవరు వెళ్లిపోవాలి అనుకుంటారో వాళ్ల పేరు చెప్పి కుండ పగలగొట్టండి అని మిగతా హౌస్‌మేట్స్‌కి చెప్పాడు. నరేశ్, దేబ్జానీ, రాంప్రసాద్, శివ్, అమన్.. రోహిత్ పేరు చెప్పగా.. వర్షిణి, ముకేశ్, నీతూ, సుధీర్.. రామకృష్ణ పేరు చెప్పారు. వంశీ, త్రిగుణ్ కూడా రోహిత్ పేరే చెబుతారు. రామకృష్ణకి నాలుగు ఓట్లు, రోహిత్‌కి ఏడు ఓట్లు రావడంతో ఇంటి సభ్యుల ఓట్లతో రోహిత్ ఎలిమినేట్ అయిపోయాడని నాగ్ ప్రకటించారు. రోహిత్ ఔట్ కావడంతో నీతూ చాలా ఏడ్చింది.
అయితే రోహిత్ ఇలా ఎలిమినేట్ అవుతాడని బిగ్‌బాస్ టీమ్ కూడా ఊహించలేదేమో! ఏవీ కూడా వేయలేదు. అందరితో మాట్లాడిన రోహిత్.. నరేశ్ నిర్ణయం ఆయనది కాదు ఇన్ఫ్లూయెన్స్ అయ్యాడని చెప్పాడు. దేబ్జానీ టార్గెట్ నేనే అని నాకు తెలుసు.. రాంప్రసాద్ నన్ను స్ట్రాంగ్ అని ఇలా చేయడం నచ్చలేదని అన్నాడు. ఈ ట్విస్ట్ ఊహించలేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం అని చెప్పిన నాగ్.. వచ్చేవారం 'రివార్డ్ అండ్ రివేంజ్' ప్రారంభమవుతుందని చెప్పారు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: రోహిత్ ఎలిమినేషన్‌కి కారణాలేంటి? పారితోషికం ఎంత?)


