ఓటీటీలో మిస్టరీ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్ | Student Of The Year After Dark OTT Details And Trailer | Sakshi
Sakshi News home page

OTT: సినిమా ఎంటర్‌టైనింగ్.. ఇప్పుడు సిరీస్ ఏమో థ్రిల్లర్

Nov 2 2026 8:47 AM | Updated on Nov 2 2026 9:09 AM

Student Of The Year After Dark OTT Details And Trailer

గతంలో హిందీలో వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' సినిమాల గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ చిత్రాల ద్వారానే ఆలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా తదితరులు నటులుగా పరిచయమయ్యారు. అయితే ఈ మూవీ ఫ్రాంచైజీ నుంచి ఇప్పుడు ఓ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ రాబోతుంది. అదే 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్: ఆఫ్టర్ డార్క్'. దీని ట్రైలర్ తాజాగా రిలీజైంది.  ఇంతకీ దీని సంగతేంటి? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా.. 'బత్తా' తెలుగు రివ్యూ)

షనయా కపూర్‌ నటించిన ఈ సిరీస్‌ ట్రైలర్ బట్టి చూస్తే.. పాఠశాలలో చదివే ఆయేషా మాలిక్‌ (షనయా కపూర్‌) అనుకోకుండా చనిపోతుంది. ఆమె కవల సోదరి అదితి (ఈ పాత్రలోనూ షనయా కపూర్‌ నటించింది).. తన సోదరి మరణం ప్రమాదవశాత్తు జరగలేదని నమ్మి, ఈ విషయాన్ని స్వయంగా విచారించాలని నిర్ణయించుకుంటుంది. ఆమె రహస్యంగా సెయింట్‌ థెరిసా పాఠశాలలోకి ప్రవేశించి, హోరాహోరీగా జరిగే ’స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పోటీలో పాల్గొంటుంది. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. రీమా మాయ దర్శకురాలు కాగా ఈ నెల 13 నుంచి హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement