ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా | Adhey Neevu Adhey Neenu Movie OTT Streaming Now | Sakshi
Sakshi News home page

OTT Movie: మూడు నెలల తర్వాత సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి

Oct 31 2026 9:02 AM | Updated on Oct 31 2026 9:02 AM

Adhey Neevu Adhey Neenu Movie OTT Streaming Now

ఓటీటీల్లోకి ఈ వీకెండ్ లెక్కలేనన్ని తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలొచ్చాయి. వీటిలో కామ్రేడ్ కళ్యాణ్, మీర్జాపుర్, సిగ్మా, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, బత్తా, అవరచన్ బాయ్స్, ఎస్సై యుగంధర్, ఇమ్మోర్టల్ చిత్రాలతోపాటు అక్క, రుద్రవనం పీస్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. ఇప్పుడు వీటికి తోడుగా ఓ తెలుగు రొమాంటిక్ మూవీ.. థియేటర్లలోకి వచ్చిన మూడు నెలల తర్వాత సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.

(ఇదీ చదవండి: శోభనం జరగనివ్వని 'తోకచుక్క'.. మలయాళ థ్రిల్లర్ 'ధూమకేతు' ఓటీటీ రివ్యూ)

'కమిటీ కుర్రోళ్లు' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యశ్వంత్, త్రినాథ్ వర్మ హీరోలుగా తన్వి నేగి హీరోయిన్‌గా చేసిన సినిమా మూవీ 'అదే నీవు అదే నేను'. జూలై 31న థియేటర్లలో రిలీజైంది కానీ జనాలు దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు చాన్నాళ్లకు ఆహా ఓటీటీలోకి వచ్చేసింది.

'అదే నీవు అదే నేను' విషయానికొస్తే కొత్తగా పెళ్లయిన సాగర్ (యశ్వంత్ పెండ్యాల), శ్రీవల్లి (తన్వీ నేగి).. ఓ గేటెడ్ కమ్యూనిటీలో దిగుతారు. సాగర్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కాగా శ్రీవల్లి హౌస్ వైఫ్. సాగర్ తల్లి సావిత్రి (కల్పలత) వల్లిని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఇలా సంతోషంగా ఉన్న శ్రీవల్లీ జీవితంలోకి కార్తీక్‌(త్రినాధ్ వర్మ) వస్తాడు. కెనడాలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే ఇతడు.. ఓ ప్రాజెక్ట్ పనిమీద హైదరాబాద్ వచ్చి శ్రీవల్లీ ఎదురు ఫ్టాట్‌లో దిగుతాడు.

తన మాట తీరుతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షించే కార్తీక్‌.. పెళ్లయిన శ్రీవల్లీని బుట్టలో పడేస్తాడు. తను తప్పు చేస్తున్నానని  తెలిసినా శ్రీవల్లీ అతడికి దూరంగా ఉండలేకపోతుంది. కొన్నాళ్ల తర్వాత కార్తీక్‌, పెళ్లి ప్రపోజల్‌ తీసుకొస్తాడు. అదే సమయంలో భర్త సాగర్‌ గురించి ఆమెకు కొన్ని నిజాలు తెలుస్తాయి. అవేంటి?  శ్రీవల్లీ తీసుకున్న సంచలన నిర్ణయమేంటి? అసలు కార్తీక్‌ వల్లీకి ఎందుకు దగ్గరయ్యాడు? కార్తీక్‌ వల్ల వల్లీ జీవితంలో వచ్చిన మలుపులేంటి? చివరకు ఏం జరిగిందనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా.. 'బత్తా' తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement