ఓరి నాయనో స్టార్ట్‌ | ori nayano new movie begins in hyderabad | Sakshi
Sakshi News home page

ఓరి నాయనో స్టార్ట్‌

Oct 31 2026 5:16 AM | Updated on Oct 31 2026 5:16 AM

ori nayano new movie begins in hyderabad

శ్రీనివాస్‌ గవి రెడ్డి, విష్ణు ఓయి, రాజీవ్‌ కనకాల, సత్యకృష్ణ. మహేష్‌ దత్తా, శ్రీకాంత్‌ రెడ్డి, మైఖేల్‌ బెన్నీ, గాయత్రి చాగంటి, ఆర్నా ముల్లర్, మురళీధర్‌ గౌడ్‌ ముఖ్య తారలుగా ‘ఓరి నాయనో’ మూవీ ఆరంభమైంది. మణితేజ గొంది దర్శకత్వంలో ఎస్‌. సాయి అభిషేక్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత వంశీ నందిపాటి క్లాప్‌ కొట్టగా, డైరెక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్‌ గౌరవ దర్శకత్వం వహించారు.

 ఈ సందర్భంగా వంశీ నందిపాటి మాట్లాడుతూ– ‘‘ఆసక్తి కరమైన కథాంశాలతో తెరకెక్కే సినిమాలు విజయం సాధించినట్లే ‘ఓరి నాయనో’ కూడా ప్రేక్షకాదరణ పొందాలి’’ అన్నారు. ‘‘2027 ఫిబ్రవరిలో మా సినిమాను రిలీజ్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని సాయి అభిషేక్‌ తెలిపారు. ‘‘ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంతో పాటు గుర్తుండిపోయే పాత్రలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని మణితేజ గొంది చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement