సమంత.. నందినీ రెడ్డి స్ఫూర్తితో... | varahi mallipamula impure movie launch | Sakshi
Sakshi News home page

సమంత.. నందినీ రెడ్డి స్ఫూర్తితో...

Oct 1 2026 4:26 AM | Updated on Oct 1 2026 4:26 AM

varahi mallipamula impure movie launch

వారాహి మల్లిపాముల నటిగా, రచయిత్రిగా, నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఇంప్యూర్‌’. ‘మా ఇంటి బంగారం’ మూవీకి డైరెక్షన్‌ విభాగంలో చేసిన నిశాంతి ఇవాని ఈ మూవీ ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. సాయి కృష్ణ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం పాన్‌ ఇండియా వ్యాప్తంగా పరిమిత థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా వారాహి మల్లిపాముల మాట్లాడుతూ– ‘‘మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాతలను ఒప్పించడం సులభం కాదు. 

నేను రాసిన స్క్రిప్ట్‌ని ఎంతోమంది నిర్మాతలకు వినిపించాను. చాలామంది తమ సందేహాలను వ్యక్తం చేశారు. ఇలాంటి టైమ్‌లోనే సమంత, నందినీ రెడ్డిగార్లు మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆదరిస్తారని ‘మా ఇంటి బంగారం’తో నిరూపించారు. ‘ఇంప్యూర్‌’ని నేనే పంపిణీ చేయడానికి వారే స్ఫూర్తినిచ్చారు. మా సినిమా స్త్రీ, పురుషుల సమస్యలపై కొత్త కోణాన్ని చూపిస్తుంది. ‘ఇంప్యూర్‌’ వరల్డ్‌ ప్రీమియర్‌ లాస్‌ ఏంజెల్స్‌లోని టీసీఎల్‌ చైనీస్‌ థియేటర్‌లో జరిగింది. అలానే న్యూయార్క్‌లోని సినిమా విలేజ్‌లో ప్రీమియర్‌ అయింది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement