‘వీరసింహారెడ్డి’ వంటి హిట్ సినిమా తర్వాత హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఎన్‌బీకే111’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రం ప్రారంభోత్సవం బుధవారం జరిగింది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ హిస్టారికల్ యాక్షన్ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం మూహుర్తపు సన్నివేశానికి బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు బి. గోపాల్ క్లాప్ ఇచ్చారు. దర్శకులు బోయపాటి శ్రీను, బాబీ, బుచ్చిబాబు గౌరవ దర్శకత్వం వహించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ స్క్రిప్ట్‌ను నిర్మాతకు అందజేశారు. ‘‘ఒక భారీ చారిత్రక కథలో బాలకృష్ణను ఇప్పటివరకు చూడని ఒక కొత్త అవతారంలో చూపించనున్న చిత్రం ఇది. చక్కని భావోద్వేగాలు, అద్భుతమైన యాక్షన్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు మంచి విజువల్ వండర్‌గా గొప్ప అనుభూతిని ఇవ్వనుంది’’ అని మేకర్స్ తెలిపారు.


