హాలీవుడ్‌ నటుడు సర్‌ ప్యాట్రిక్‌ స్టీవర్ట్‌ మృతి  | Legendary Star Trek actor Sir Patrick Stewart Passed Away | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌ నటుడు సర్‌ ప్యాట్రిక్‌ స్టీవర్ట్‌ మృతి 

Oct 31 2026 5:23 AM | Updated on Oct 31 2026 5:23 AM

Legendary Star Trek actor Sir Patrick Stewart Passed Away

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు సర్‌ ప్యాట్రిక్‌ స్టీవర్ట్‌ (86) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అల్జీమర్స్‌ వ్యాధి, లూయీ బాడీ డిమెన్షియాతో పోరాడుతూ లాస్‌ ఏంజిల్స్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. బ్రిటన్‌కు చెందిన సర్‌ ప్యాట్రిక్‌ స్టీవర్ట్‌ 1960వ దశకంలో రాయల్‌ షేక్స్‌పియర్‌ కంపెనీలో చేరి, ‘హామ్లెట్, మ్యాక్‌బెత్‌’ వంటి నాటకాలతో రంగస్థలంపై తన మక్కువను చాటుకున్నారు. సుమారు 14 ఏళ్ల పాటు షేక్స్‌పియర్‌ కంపెనీలో పని చేసి, మంచి గుర్తింపు పొందారు. 

‘స్టార్‌ ట్రెక్‌: ది నెక్ట్స్‌ జనరేషన్‌’ (1987) చిత్రంలో పోషించిన కెపె్టన్‌ జీన్‌ లూక్‌ పికార్డ్‌ పాత్ర ఆయన జీవితాన్ని మార్చేసింది. 1994 వరకు కొనసాగిన ఈ సిరీస్‌ ద్వారా ప్యాట్రిక్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. అలాగే ‘ఎక్స్‌–మెన్‌’ మూవీస్‌లో ్రపొఫెసర్‌ చార్లెస్‌ జేవియర్‌ పాత్రలోనూ అద్భుతంగా నటించారు. ‘లోగన్‌’ సినిమాలో అద్భుతమైన భావోద్వేగాలు పండించారు. నటుడిగా ఆయన అందించిన సేవలకు గాను 2010లో క్వీన్‌ ఎలిజబెత్‌ 2 చేతుల మీదుగా నైట్‌హుడ్‌ పురస్కారాన్ని అందుకున్నారు స్టీవర్ట్‌. ఆయన నటించిన ‘అవెంజర్స్‌: డూమ్‌డే’ చిత్రం డిసెంబరు 17న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement