'పోరా మతిమరుపు'.. ఈసారి నామినేషన్లు ఎలా జరిగాయి? | Bigg Boss 10 Telugu Day 57, November 2nd 2026 Full Episode Highlights, Vamshi And Mukesh Clash As Contestants Nominate Housemates In New Task | Sakshi
Sakshi News home page

Bigg Boss 10 Day 57: సందడిగా 9వ వారం నామినేషన్లు

Nov 3 2026 9:37 AM | Updated on Nov 3 2026 9:55 AM

Bigg Boss 10 Telugu Day 57 Highlights

రోహిత్ ఎలిమినేట్ కావడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. నామినేషన్ ప్రక్రియతో సోమవారం ఎపిసోడ్ మొదలైంది. ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌లో 'రివార్డ్ అండ్ రివెంజ్' ఉండనుంది. ఇందులో భాగంగా ప్రతి ఇంటి సభ్యుడికి ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. నామినేట్ చేయాలనుకున్న ఇద్దరి ఫోటోలను ఫైర్ పిట్‌లో వేసి ప్రక్రియని పూర్తి చేయాలి. కెప్టెన్‌గా ఉన్న త్రిగుణ్‌ని మాత్రం ఎవరూ నామినేట్ చేయకూడదు అని బిగ్‌బాస్ స్పష్టం చేశాడు.  

(ఇదీ చదవండి: ‘మెగా’ ఇంట్లో పెళ్లి బాజాలు​.. ఈ నెల 5న ఎంగేజ్‌మెంట్‌!?)

మొదటగా వచ్చిన వంశీ.. ముకేశ్‌ని నామినేట్ చేశాడు. ఝాన్సీ మీ వల్ల చాలా బాధ పడింది. తను ఏడవటానికి మీరే కారణం. ఇలాంటి షోలో మీరు మాట్లాడే మాటలు నేను అస్సలు ఊహించలేదు. ఒక వ్యక్తిని రాడ్ తీసుకుని ఇలా కొట్టాలి, అలా చేయాలి అని మీ అసభ్యకరమైన మాటలు విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. మీరు మాట్లాడే మాటలను చూసి బయటివాళ్లు ఏమనుకుంటారు? దయచేసి కళ్లు తాగిన కోతిలా ప్రవర్తించకండి. ప్రతి విషయంలోనూ అందరి మీదకు వెళ్లడం, అవసరం లేని చోట రెచ్చిపోవడం లాంటివి తగ్గించుకోండి అని కారణాలు చెప్పాడు.

తర్వాత వర్షిణిని నామినేట్ చేశాడు. మీ వల్ల చాలాసార్లు రాత్రిపూట నిద్రకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటికే ఎన్నోసార్లు వార్నింగ్స్ ఇచ్చినా మీరు మాత్రం మారడం లేదు. ఇది ఒక పాయింట్. ఇక రెండోది మీ పర్సనాలిటీ గురించి. మీరు పర్సనాలిటీ గురించి ఇంతగా మాట్లాడుతున్నారు కాబట్టి మీ నుంచి నేను ఇలాంటిది ఊహించలేదు. తొలివారంలో రాంప్రసాద్ విషయంలో మీరు హర్ట్ అయ్యారు. ఆ విషయాన్ని ఇంతకాలం మనసులో పెట్టుకుని, నిన్న కార్డుపై రాసి బయటపెట్టాల్సిన అవసరం ఏముంది? మీరు తప్పులని గుర్తించే వ్యక్తి అయితే, కనీసం ఒక్కసారైనా ఆయన్ని నామినేట్ చేసి ఉండాలి కదా? అని వర్షిణిని ప్రశ్నించాడు.

సుధీర్ తన మొదటి నామినేషన్ వంశీకి వేశాడు. మిథిలేష్ సూట్‌కేస్ తీసుకుని వెళ్లినప్పుడు మీరు నా పక్కనే కూర్చున్నారు. ఆ రోజు మనమందరం డబ్బు కోసం రాలేదు, పేరు సంపాదించుకోవడం కోసమే వచ్చామని చెప్పుకున్నాం. కానీ మీరు మాత్రం ఒక 20 లక్షలో, 25 లక్షలో ఇచ్చి ఉంటే నేను కూడా వెళ్లిపోయేవాడిని కదా డార్లింగ్ అని నాతో అన్నారు. అంటే మీకు డబ్బు ముఖ్యమా? పేరు ముఖ్యమా? అని అడిగాడు. తర్వాత సుధీర్ రెండో నామినేషన్ అమన్‌కి వేశాడు. హోటల్ టాస్క్‌లో స్టార్స్ విషయంలో చాలామంది నీ దగ్గరకు వచ్చి నన్ను స్టార్ ఇవ్వమని అడుగుతున్నారని, వెంటనే రోహిత్ దగ్గరకు వెళ్లి ఆ స్టార్ నీ దగ్గరే పెట్టుకో అని ఇచ్చేశావు. ఆ టైంలో నువ్వు నీ ఫ్రెండ్‌షిప్‌ నిరూపించుకోవాలని అలా చేశావని అనిపించింది. కానీ నిన్న నువ్వే అతన్ని ఈ హౌస్ నుంచి వెళ్లిపోవాలని చెప్పావ్. ఆ ఒక్కటి ఫ్రెండ్‌షిప్ పరంగా నాకు నచ్చలేదని కారణాలు చెప్పాడు.

(ఇదీ చదవండి: నన్ను ముందుకు నడిపిస్తోంది జ్యోతికనే)

శ్వేత ముకేశ్‌ని నామినేట్ చేసింది. బాల్ టాస్క్ రాంప్రసాద్‌ను కన్విన్స్ చేయడానికి బదులుగా తన సపోర్టర్స్ దగ్గరకు వెళ్లి నిజాయితీగా అడిగితే గేమ్ ఫలితం మరోలా ఉండేదేమోనని చెప్పింది. తర్వాత అమన్‌ని నామినేట్ చేసింది. మొదటినుంచి అమన్ తనకు సపోర్ట్ చేస్తున్నాడని, తాను కూడా అమన్‌కు పాజిటివ్, నెగిటివ్ రెండూ చెబుతూ గేమ్‌ మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపింది. తర్వాత నీతూ మాస్టర్ వర్షిణి, వంశీలని నామినేట్ చేసింది.

ముకేశ్ మొదటగా వంశీని నామినేట్ చేశాడు. మీ గేమ్ జీరో.. త్రిగుణ్‌కి పప్పెట్ అయిపోయి ఆడుతున్నారు కానీ మీ గేమ్ ఏం లేదు. టెంపర్ టెంపర్ అని వంశీని ముకేశ్ పిలుస్తుంటే.. పోరా మతి మరుపు అని ముకేశ్‌పై వంశీ సెటైర్ వేశాడు. అలా వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగింది. తర్వాత ముకేశ్.. దేబ్జానీని నామినేట్ చేశాడు. ఇక రామకృష్ణ ముకేశ్‌, నీతూని నామినేట్ చేశాడు. నరేశ్.. అమన్‌, వర్షిణిని నామినేట్ చేశాడు. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది.

(ఇదీ చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ జంట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement