నన్ను ముందుకు నడిపిస్తోంది జ్యోతికనే | Suriya About Life With Wife Jyotika Latest Speech | Sakshi
Sakshi News home page

Suriya Jyotika: వాటన్నింటికీ జ్యోతికనే కారణం

Nov 3 2026 7:44 AM | Updated on Nov 3 2026 7:44 AM

Suriya About Life With Wife Jyotika Latest Speech

తమిళ సినీ జంట సూర్య-జ్యోతిక గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. రీసెంట్‌గానే 20 వసంతాల దాంపత్య జీవితాన్ని ఆనందంగా జరుపుకొన్నారు. తమది పరిపూర్ణ దాంపత్య జీవితమని చెప్పను కానీ ఒకరిని ఒకరు అర్థం చేసుకుని నడుచుకునే అందమైన జీవితమని ఆ సందర్భంగా జ్యోతిక పేర్కొంది. సూర్య అయితే జ్యోతిక నా భార్య కావడం నా అదృష్టం అని చాలాసార్లు చెప్పాడు. ఇదే విషయాన్ని ఇటీవల చైన్నెలో జరిగిన 'సీన్‌' ఆడియో లాంచ్ ఈవెంట్‌లోనూ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: ‘మెగా’ ఇంట్లో పెళ్లి బాజాలు​.. ఈ నెల 5న ఎంగేజ్‌మెంట్‌!?)

సూర్య, నజ్రియా జంటగా నటించిన లేటెస్ట్ సినిమా 'సీన్‌'. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్‌ తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని సూర్య,జ్యోతికలే నిర్మించారు. ఈ శుక్రవారం(నవంబర్ 5) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇకపోతే ఆడియో లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన సూర్య.. నా జీవితంలో నేను ఈ స్థాయిలో ఉండటానికి, సరైన మార్గంలో పయనించడానికి నా భార్య జ్యోతికనే ముఖ్య కారణం. జీవితంలో నేను చాలా తప్పులు చేసినా, నా పక్కన బలంగా నిలిచి మంచి మార్గంలో నడిపిస్తోంది. ఆమె ఉత్తమ తల్లి. ఉత్తమ స్నేహితురాలు. అత్యుత్తమ జీవిత భాగస్వామి. అంతే కాదు శక్తివంతమైన స్త్రీ అని సూర్య తను అర్ధాంగి జ్యోతికను ప్రశంసల్లో ముంచెత్తాడు.

(ఇదీ చదవండి: 'నా కెరీర్‌లో చాలా తప్పులు చేశా'.. సూర్య ఎమోషనల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement