గేమింగ్‌ రంగంలోకి మహేశ్‌ బాబు | Mahesh Babu Enters Global Gaming Industry With Strategic Investments | Sakshi
Sakshi News home page

గేమింగ్‌ రంగంలోకి మహేశ్‌ బాబు

Nov 3 2026 5:27 AM | Updated on Nov 3 2026 5:27 AM

Mahesh Babu Enters Global Gaming Industry With Strategic Investments

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: తెలుగు సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు తాజాగా గేమింగ్‌ రంగంలోకి అడుగు పెట్టారు. ముంబైకి చెందిన  ఇంటరాక్టివ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ షార్ట్‌గన్‌ గేమ్స్‌లో వ్యూహాత్మక ఇన్వెస్టరుగా చేరారు. పీసీ, కన్సోల్‌ గేమ్స్‌ తయారు చేసే షార్ట్‌గన్‌ సంస్థ ప్రస్తుతం అమెరికా, యూరప్, బ్రిటన్‌ తదితర దేశాల్లోని గేమర్స్‌ని దృష్టిలో ఉంచుకుని టేక్‌డౌన్‌ జెనిసిస్‌ పేరిట భారీ యాక్షన్‌ అడ్వెంచర్‌ గేమ్‌ను అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తోంది. 

దేశీయంగా అపార సృజనాత్మక సామర్థ్యాలు ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా మనవాళ్లు సరికొత్త పాత్రలు, కథలను సృష్టించేందుకు ఇది సరైన సమయమని మహేశ్‌ బాబు తెలిపారు. భారత్‌ కూడా ప్రపంచస్థాయి పీసీ, కన్సోల్‌ గేమ్స్‌ను రూపొందించగలదని నిరూపించడమే తమ లక్ష్యమని సంస్థ సహ వ్యవస్థాపకులు విధిత్‌ మెహతా, జీత్‌ చందన్‌ పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement