ప్రపంచ కుబేరుల్లో అంబానీ జోరు | RIL chairman Mukesh Ambani tops Forbes global billionaire gainers list | Sakshi
Sakshi News home page

ప్రపంచ కుబేరుల్లో అంబానీ జోరు

Nov 3 2026 5:23 AM | Updated on Nov 3 2026 5:56 AM

RIL chairman Mukesh Ambani tops Forbes global billionaire gainers list

ఒకేరోజున అత్యధికంగా పెరిగిన సంపద  

6 బిలియన్‌ డాలర్లు అప్‌ ఫోర్బ్స్‌ రియల్‌ టైమ్‌ 

బిలియనీర్స్‌ లిస్టులో అగ్రస్థానం

న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ జోరు కొనసాగుతోంది. రిలయన్స్‌ షేర్ల దూకుడుతో ఆయన సంపద ఒకే రోజున ఏకంగా 6 బిలియన్‌ డాలర్లు పెరిగింది. దీంతో ఈ అంశానికి సంబంధించి ఫోర్బ్స్‌ రియల్‌ టైమ్‌ బిలియనీర్స్‌ లిస్టులో ఆయన అగ్రస్థానం దక్కించుకున్నారు. నవంబర్‌ 2 నాటి గణాంకాల ప్రకారం 7.85 శాతం (6.3 బిలియన్‌ డాలర్లు) సంపద వృద్ధితో ఆయన టాప్‌ ర్యాప్‌ ర్యాంకులో నిల్చారు. 1.7 బిలియన్‌ డాలర్ల వృద్ధితో స్పానిష్‌ రిటైల్‌ 
దిగ్గజం అమాన్సియో ఓర్టెగా రెండో స్థానంలో, 1.5 బిలియన్‌ డాలర్ల పెరుగుదలతో చైనాకు చెందిన ఝాంగ్‌ షాన్షాన్‌ మూడో స్థానంలో ఉన్నారు. 

తాజా గణాంకాల ప్రకారం 88.8 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచ బిలియనీర్ల లిస్టులో అంబానీ 23వ స్థానానికి చేరుకున్నారు. మరో దిగ్గజం గౌతమ్‌ అదానీ 79.12 బిలియన్‌ డాలర్ల సంపదతో 26వ స్థానంలో ఉన్నారు. ‘125 బిలియన్‌ డాలర్ల ఆదాయాలున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి ముకేశ్‌ అంబానీ సారథ్యం వహిస్తున్నారు‘ అని ఫోర్బ్స్‌ పేర్కొంది. పటిష్టమైన సెపె్టంబర్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ర్యాలీ చేయడం అంబానీ సంపద వృద్ధికి దోహదపడింది. ఆరేళ్ల వ్యవధిలో తొలిసారిగా సోమవారం నాడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు దాదాపు 12 శాతం ర్యాలీ చేసి, గరిష్ట స్థాయి రూ. 1,299 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement