ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ ప్రస్తుతం ‘ది ట్రైటర్స్ తెలుగు’లో తన ఆటతీరుతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తన ‘గట్ ఫీలింగ్’పై నమ్మకంతో ముందుకెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో హిందీ వెర్షన్ ‘ది ట్రైటర్స్’ సీజన్ 2లో పాల్గొన్న పరుల్ గులాటీతో శ్రావ్యను పోలుస్తూ నెట్టింట చర్చ జరుగుతోంది.
‘రింగ్ ఆఫ్ డౌట్’ టాస్క్‌లో
రెడ్డిట్‌లో జరిగిన చర్చలో వీరిద్దరి ఆటతీరులోని పోలికలను నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. ఆటలోని పరిణామాలను తమదైన కోణంలో విశ్లేషించడం, అనుమానాలను బలంగా వ్యక్తం చేయడం వీరిద్దరిలో కనిపించే లక్షణాలుగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ‘రింగ్ ఆఫ్ డౌట్’ టాస్క్‌లో శ్రావ్య ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తన అంతరాత్మ చెప్పిందే నమ్ముతాననే ఆమె వైఖరి కూడా చర్చకు కారణమైంది.
మోసాలు, రహస్యాలు, వ్యూహాలతో సాగే ఈ ఆటలో ఎవరిని నమ్మాలి? ఎవరిపై అనుమానం వ్యక్తం చేయాలి? అనేది కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో శ్రావ్య తన అంచనాలపై గట్టిగా నిలబడటాన్ని కొందరు ఆమె పరిశీలనా సామర్థ్యంగా చూస్తుండగా.. మరికొందరు కేవలం అంతరాత్మ చెప్పిన మాటను నమ్మడం ఎంతవరకు సరైనదని ప్రశ్నిస్తున్నారు.
శ్రావ్య వర్మ గట్ ఫీలింగ్
మరి శ్రావ్య వర్మ గట్ ఫీలింగ్ ఆమెకు విజయాన్ని అందిస్తుందా? లేక తప్పు అంచనాలతో ఇబ్బందుల్లో పడేస్తుందా? రాబోయే ఎపిసోడ్‌లలో ఆమె అనుమానాలు ఎంతవరకు నిజమవుతాయనేది ఆసక్తికరంగా మారింది.
కాగా తేజ సజ్జా హోస్ట్‌గా ‘ది ట్రైటర్స్ తెలుగు’ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియోతో పాటు ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఎపిసోడ్‌లు విడుదలవుతున్నాయి.
(ఇదీ చదవండి: విధి విసిరిన సవాళ్లు.. వ్యాధులను జయించిన తారలు..)


