చొక్కా నలగకుండా రూ.500 కోట్లు.. రజనీకే సాధ్యం: అల్లు అర్జున్‌ | Allu Arjun About Rajinikanth Jailer 2 Movie Rs 500 Crore Without Creasing His Shirt | Sakshi
Sakshi News home page

Allu Arjun About Rajinikanth: జైలర్‌2పై అల్లు అర్జున్‌ ప్రశంసలు

Oct 22 2026 3:31 PM | Updated on Oct 22 2026 4:13 PM

Allu Arjun About Rajinikanth Jailer 2 Movie Rs 500 Crore Without Creasing His Shirt

రజనీకాంత్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ జైలర్-2. గతంలో రిలీజైన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే వందకోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. మూడు రోజుల్లోనే సరికొత్త రికార్డ్ సృష్టించింది.

 కేవలం త్రీ డేస్‌లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల వసూళ్లు దాటేసింది.  ప్రస్తుతం అదే దిశగా దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్.. రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

ఫిదా అయ్యా
‘రజనీ స్టైల్, స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు నేను ఫిదా అయ్యా. ఈ సినిమా ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపే కమర్షియల్ ఎంటర్‌టైనర్ జైలర్‌ 2. అనిరుధ్ సంగీతం, నెల్సన్ దర్శకత్వం, చిత్రబృందం కృషి కనిపిస్తోంది. చొక్కా నలగకుండా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఒక్క రజినీకాంత్ గారికే సాధ్యం’ అంటూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.  బన్నీ చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం ‘రాకా’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.  డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చేస్తున్నారు.

(ఇదీ చదవండి: అర్ధరాత్రి బన్నీకి ఫోన్‌.. లేచే ఉన్నావా అన్నా..: విజయ్‌ దేవరకొండ)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement