టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ మధ్య ఉన్న అనుబంధం మరోసారి బయటపడింది. కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఓ ఆసక్తికరమైన ఫోన్ కాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ షోలో భాగంగా నిర్వహించిన గేమింగ్ రౌండ్‌లో సెలబ్రిటీ స్నేహితుడికి ఫోన్ చేయాలని విజయ్ దేవరకొండకు టాస్క్ ఇచ్చారు. దీంతో ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా అల్లు అర్జున్‌కు కాల్ చేశారు. అప్పుడు సమయం రాత్రి 11.40 గంటలు. అయినప్పటికీ బన్నీ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి విజయ్‌తో మాట్లాడారు.
బన్నీ అన్నా.. నిద్ర లేచే ఉన్నారా?
ఈ క్రమంలో ‘బన్నీ అన్న.. నిద్ర లేచే ఉన్నారా?’ అని విజయ్ అడగ్గా.. ‘లేచే ఉన్నాను’ అని అల్లు అర్జున్ సమాధానమిచ్చారు. ఇంత రాత్రి సమయంలో ఫోన్ చేయడానికి గల కారణాన్ని విజయ్ సరదాగా వివరించారు.
‘నేను కాఫీ విత్ కరణ్ షోలో ఉన్నాను. వీళ్లకు టైమ్ సెన్స్, సందర్భం అసలేమీ లేదు. రాత్రి 11.40 గంటలకు ఎవరికైనా ఫోన్ చేయమన్నారు. నన్ను ఇష్టపడే వారిలో ఈ సమయంలో ఫోన్ చేస్తే తిట్టకుండా ఎవరు లిఫ్ట్ చేస్తారా అని ఆలోచించాను. ఇండస్ట్రీలో మనల్ని ప్రేమించేవాళ్లు ఎవరు ఉన్నారు? ఎవరితో అంత చనువు ఉంది? అని అనుకుని మొదట మీకే కాల్ చేశాను’ అని విజయ్ తెలిపారు.
అల్లు అర్జున్ నవ్వుతూ
దీనికి అల్లు అర్జున్ నవ్వుతూ స్పందించారు. ‘ఇట్స్ ఓకే.. పర్వాలేదు. నువ్వు కాల్ చేయడం చాలా స్వీట్’ అంటూ విజయ్‌తో అన్నారు. ఆ తర్వాత కరణ్ జోహార్, రష్మిక మందన్నతోనూ బన్నీ మాట్లాడారు. ఈ సంభాషణతో షోలో సందడి నెలకొంది.
కాగా హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘రణబాలి’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దసరా కానుకగా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు విడుదల రోజున మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ మంచి వసూళ్లను రాబడుతోంది.
(ఇదీ చదవండి: ఈ ట్విస్ట్ మెసేజ్ చేస్తే రూ.కోటి ఇస్తా..: స్టార్ డైరెక్టర్)
Calling him Bunny Anna on #KoffeeWithKaran shows that brotherly bond ❤️🔥 #AlluArjun Anna, we know you’re busy with your shoot, but when you get a moment, please watch #Ranabaali. Your favourite @TheDeverakonda has poured his heart, soul & immense hard work into this film. ❤️🔥 It would means the Lots Of World to us 🫂❤️ #VijayDeverakonda https://t.co/SvFSz8RbJM
— Vijay Deverakonda Fans Club (@VJDeverakondaFC) October 21, 2026


