ఈ ట్విస్ట్‌ నాకు మెసేజ్‌ చేస్తే రూ.కోటి ఇస్తా..: స్టార్‌ డైరెక్టర్‌ | Director Poorvaj Killer Movie Event Open Offer One Crore | Sakshi
Sakshi News home page

Director Poorvaj Killer : సినిమాలో ట్విస్ట్‌ చెప్తే రూ. కోటి మీ సొంతం: డైరెక్టర్‌

Oct 22 2026 1:59 PM | Updated on Oct 22 2026 2:22 PM

Director Poorvaj Killer Movie Event Open Offer One Crore

జ్యోతి పూర్వాజ్‌, పూర్వాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘కిల్లర్‌’. మనీష్‌ గిలాడా, చంద్రకాంత్‌ కొల్లు, విశాల్‌ రాజ్‌, అర్చన అనంత్‌, గౌతమ్‌ చక్రధర్‌ కొప్పిశెట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూర్వాజ్‌, పద్మనాభ రెడ్డి.ఏ నిర్మిస్తున్న ఈ సినిమాకు పూర్వాజ్‌ దర్శకత్వం వహించారు. ఈ నెల 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు ఆసక్తికరమైన ప్రకటన చేశారు. సాధారణంగా సినిమా విడుదలకు ముందు కొందరు దర్శకులు తమ చిత్రంపై నమ్మకంతో సవాళ్లు విసురుతుంటారని, అయితే తాను అలాంటి వ్యాఖ్యలు చేయనని తెలిపారు.

ద్వితీయార్ధంలో వచ్చే ట్విస్ట్‌
‘కిల్లర్‌’ చిత్రంలో ఇంటర్వెల్‌ సమయంలో, ద్వితీయార్ధంలో వచ్చే ట్విస్ట్‌ను ఎవరైనా ముందుగా కనిపెట్టి 15 నిమిషాల లోపల తమకు మెసేజ్‌ పంపిస్తే రూ.కోటి బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. ఈ మొత్తాన్ని సినిమా సక్సెస్‌ మీట్‌లో అదే వేదికపై అందజేస్తానని చెప్పారు.  దీనికి సంబంధించిన వాట్సప్‌ నెంబర్‌ను ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రోజు తెలియాజేస్తానని తెలిపారు. దీంతో దర్శకుడు ప్రకటించిన ఈ భారీ ఆఫర్‌ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

(ఇదీ చదవండి: ‘B’ కేటగిరీ వాళ్లమే కదా.. ఆ అవకాశాలైనా ఇవ్వండి: తెలుగు నటి రజిత)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement